డ్యూటీకి వెళ్తున్న కుమార్తెకు గోరు ముద్దలు తినిపించిన తండ్రి.. హత్తుకునే వీడియో

తండ్రీకూతుళ్ల బంధం చాలా ప్రత్యేకమైనది.ఇంట్లో ఎంత మంది కొడుకులు ఉన్నా కుమార్తెలపై( Daughter ) తండ్రులు సహజంగా ఎక్కువ ప్రేమను చూపుతారు.

వారు అల్లరి చేసినా సహిస్తారు.ఒక్క దెబ్బ కూడా కొట్టకుండా పెంచుతారు.

చాలా గారాబంగా పెంచి పెళ్లి చేస్తారు.ముఖ్యంగా పెళ్లి సమయంలో అత్తారింటికి పంపుతూ కన్నీళ్లు పెట్టుకుంటారు.

ఇలా ఎంతో వారి మధ్య అనుబంధం పెనవేసుకుని ఉంటుంది.ఇలాంటి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇందులో కూతురు తన డ్యూటీకి వెళ్లేందుకు సిద్ధమవుతుండగా, తండ్రి( Father ) ఆమెకు భోజనం తినిపించాడు.

పూజా బిహానీ శర్మ అనే యూజర్ ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.

"""/" / పూజ( Pooja ) వృత్తి రీత్యా ఎయిర్ హోస్టెస్.ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో( Indigo Airlines ) ఆమె పని చేస్తారు.

ఆమె తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన క్షణాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటూనే ఉంటుంది.ఈ వీడియోలో పూజ అద్దం ముందు నిలబడి ఆమె మేకప్ వేసుకుంటోంది.

ఆమె తండ్రి అక్కడే నిలబడి ఉన్నాడు.ఒక చేతిలో ప్లేటు పట్టుకుని, మరో చేత్తో ఆహారం తన కుమార్తెకు తినిపిస్తున్నాడు.

ఆ వీడియోలో ఆ తండ్రి తన కూతురిని తల్లిలా చూసుకుంటున్నాడు.ఈ వీడియోను పోస్ట్ చేస్తూ, ఎయిర్ హోస్టెస్ ఇలా రాసింది.

"""/" / 'పాపా, నువ్వే బెస్ట్.నేను మీతో ఎక్కువ మాట్లాడను అని నాకు తెలుసు, కాబట్టి ఈ రోజు నేను చెప్పాలనుకుంటున్నాను.

నాన్న, నాకు అన్నీ ఇచ్చినందుకు ధన్యవాదాలు.నువ్వు ఉండే చోటే నా ఇల్లు.

నేను నిన్ను ప్రేమిస్తున్నాను నాన్న' అని క్యాప్షన్ ఇచ్చింది.ఈ వీడియోను ఇప్పటికే కోట్లాది మంది చూశారు.

9 లక్షల మంది లైక్ చేశారు.చాలా మంది నెటిజన్లు దీనిపై కామెంట్లు చేశారు.

కుమార్తెల పట్ల తండ్రికి ఉండే ప్రేమ( Father Love ) చాలా ప్రత్యేకమని, మన తల్లిదండ్రుల కంటే మనల్ని ఎవరూ ఎక్కువగా చూడలేరని పేర్కొన్నాడు.

'నువ్వు అదృష్టవంతురాలివి.అందరికీ అలాంటి తండ్రి దొరకడు' అని మరికొందరు కామెంట్లు చేశారు.

దగ్గు, గొంతు నొప్పి, కఫం తో బాధపడుతున్నారా.. అయితే అతి మధురం ఉందిగా అండగా!!