దాస్ కా ధమ్కీ మూవీ ఫస్ట్ డే కలెక్షన్ల లెక్కలివే.. విశ్వక్ సాధించాడంటూ?

విశ్వక్ సేన్( Vishwak Sen ) హీరోగా తెరకెక్కిన దాస్ కా ధమ్కీ మూవీపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయనే సంగతి తెలిసిందే.

ఈ సినిమా పూర్తిస్థాయిలో కాకపోయినా కొంతమేర అంచనాలను అందుకుంది.ఈ మధ్య కాలంలో థియేటర్లలో రిలీజైన సినిమాలేవీ ప్రేక్షకులను పూర్తిస్థాయిలో మెప్పించలేదు.

అయితే దాస్ కా ధమ్కీ( Das Ka Dhamki ) మాత్రం ఒక వర్గం ప్రేక్షకులకు నచ్చేలా ఉండటం ఈ సినిమాకు ప్లస్ అయింది.

ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 4 కోట్ల రూపాయల రేంజ్ లో కలెక్షన్లను సాధించింది.

9 కోట్ల రూపాయల టార్గెట్ తో ఈ సినిమా రిలీజ్ కాగా మిక్స్డ్ టాక్ రావడంతో ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోవడం సాధ్యమవుతుందో లేదో చూడాల్సి ఉంది.

నైజాంలో ఈ సినిమా 91 లక్షల రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకోగా సీడెడ్ లో 43 లక్షలు, వైజాగ్, ఈస్ట్, వెస్ట్ లలో 90 లక్షలు, కృష్ణ గుంటూరు జిల్లాలలో 65 లక్షల రూపాయల కలెక్షన్లను సాధించింది.

"""/" / ఒంగోలు, నెల్లూరు జిల్లాలలో ఈ సినిమాకు 17 లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి.

ఓవర్సీస్ లో ఈ సినిమా 60 లక్షల రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకోగా కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఈ మూవీకి 40 లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి.

ఈరోజు, రేపు కలెక్షన్లను బట్టి ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందో లేదో తెలిసే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.

"""/" / దాస్ కా ధమ్కీకి సీక్వెల్( Sequel To Das Ka Dhamki ) ఉంటుందని సినిమాలో హింట్ ఇవ్వగా ఈ సినిమా విషయంలో విశ్వక్ సేన్ ఎలా వ్యవహరిస్తారో చూడాల్సి ఉంది.

ధమ్కీ మూవీ కాన్సెప్ట్ కొత్తగానే ఉన్నా ఏదో మిస్ అయిందనే భావనను అయితే కలిగించిందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

దాస్ కా ధమ్కీ సక్సెస్ తో విశ్వక్ సేన్ కొత్త ప్రాజెక్ట్ లపై అంచనాలు పెరుగుతున్నాయి.

డ్యామిట్.. కథ అడ్డం తిరిగింది.. వర్షంలో డాన్స్ చేద్దాం అనుకుంటే చివరకి..?