డీ శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడంపై ఆయన కుమారుడు డి.సంజయ్ సంచలన వ్యాఖ్యలు..
TeluguStop.com
ధర్మపురి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడంపై ఆయన కుమారుడు డి.సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
డీఎస్‌పై కుట్ర జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.ఆయనకు ప్రాణహాని ఉందన్నారు.
ఆయన చుట్టూ ఉన్న వాళ్లపై తనకు అనుమానం ఉందన్నారు.మా నాన్నను నిజామాబాద్ ఎంపీ అర్వింద్ బ్లాక్ మెయిల్ చేసి లేఖపై సంతకం చేయించారని తెలిపారు.
ఆస్తులు కూడా బెదిరించి రాయించుకున్నారని అన్నారు.డీఎస్ రాజీనామా చేసిన సంతకం కూడా ఫేక్ అని అన్నారు.
డీఎస్‌ను రూమ్‌లో బంధించి సంతకం చేయించుకున్నారని అంటున్నారు డి.సంజయ్.
మా నాన్న ఫోన్ కూడా లిఫ్ట్ చేయించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.
నిజామాబాద్ జనం అంతా గమనిస్తున్నారని.తన తండ్రిని బ్లాక్ మెయిల్ చేసి ఆస్తులు రాయించుకున్నారని విమర్శించారు.
దీని వెనుక ఎంపీ అర్వింద్ ఉన్నారని విమర్శించారు.మా అమ్మకు రాజకీయాలు తెలియవన్నారు.
తను తమ్ముడు, ఎంపీ అర్వింద్ మాటలు నమ్ముతుందన్నారు.
ట్రక్కుతో వైట్‌హౌస్‌లో విధ్వంసానికి కుట్ర .. తెలుగు యువకుడికి జైలు శిక్ష