తెలంగాణ వ్యాప్తంగా గాలివాన బీభత్సం.. 13 మంది మృతి

తెలంగాణ వ్యాప్తంగా గాలివాన బీభత్సం సృష్టించింది.దీంతో 13 మంది మృత్యువాత పడ్డారు.

పలు ప్రాంతాల్లో చెట్లు విరిగిపడగా.షెడ్లు, కరెంట్ స్తంభాలు కూలిపోయాయి.

అదేవిధంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు( Power Supply ) తీవ్ర అంతరాయం ఏర్పడింది.

పలు చోట్ల రోడ్లపై భారీ చెట్లు విరిగిపడ్డాయి.ఈ క్రమంలోనే హైదరాబాద్ లోని వనస్థలిపురంలో భారీ వృక్షం నేలకొరిగింది.

హయాత్ నగర్ లో బస్సుపై చెట్టు పడింది.నాగర్ కర్నూల్ జిల్లాలోనే ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.

హైదరాబాద్ లో నలుగురు, మెదక్ జిల్లాలో వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు చనిపోయారు.ఒక రంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల్లో గాలి దుమారంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలక పరిణామం.. పోటీ నుంచి తప్పుకున్న జో బైడెన్