ఉద్యోగాల కోసం వెతుకుతున్నారా..? మీకు ఇలాంటి ఆఫర్ లెటర్స్ వస్తే జాగ్రత్త సుమా…!

ప్రస్తుతం కరోనా వైరస్ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా చాలా మంది వారి ఉద్యోగాలు పోగొట్టుకొన్న సంగతి అందరికీ తెలిసిందే.

అయితే మళ్లీ ఉద్యోగాల కోసం కొన్ని కంపెనీలు ఉద్యోగులను నియమించుకునే ప్రక్రియలో భాగంగా చాలా మంది ఆన్లైన్ జాబ్ పోర్టల్స్లో కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు.

ఇందులో భాగంగానే ఉద్యోగాలు కావాల్సిన వారు వారి రెజ్యూమ్ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తూ ఉంటారు.

అయితే సరిగ్గా ఇదే విషయాన్ని పసిగట్టిన ఆన్లైన్ మోసగాళ్లు అలా ఎవరైతే రెజ్యూమ్ లను అప్లోడ్ చేశారు వారిని టార్గెట్ చేస్తూ గత కొంతకాలంగా మోసాలు చేస్తున్నారు.

డెల్, హెచ్ పి, మైక్రోసాఫ్ట్, గూగుల్, క్వాల్కమ్ లాంటి ఎన్నో దిగ్గజ కంపెనీల నుండి ఓ మెయిల్ వచ్చినట్లుగా మీకు మెయిల్ పంపుతారు సైబర్ నేరగాళ్లు.

మీరు అప్లోడ్ చేసిన రెజ్యూమ్ లో ఉండే From అడ్రస్ ను ఆధారంగా చేసుకొని సైబర్ నేరగాళ్లు మోసం చేయడానికి పాల్పడతారు.

ముందుగా మీరు అప్లై చేసిన సంబంధిత కంపెనీ డొమైన్ నుండి మీకు ఒక మెయిల్ వస్తుంది.

అది మీకు చూడడానికి ఏ మాత్రం అనుమానం రాకుండా ఉండేటట్లు పకడ్బందీగా పంపుతారు.

అయితే ఆన్ లైన్ మోసగాళ్లు అయితే ఆన్లైన్ టెస్ట్, ఆన్లైన్ ఇంటర్వ్యూ అంటూ రకరకాల పేర్లు చెప్పి వారి నుంచి భారీగా డబ్బు వసూలు చేసి మోసగిస్తున్నారు.

మరికొందరైతే నకిలీ వ్యక్తులు ఏకంగా స్కైప్, జూమ్ లలో వర్చువల్ ఇంటర్వ్యూలను కూడా ఆన్లైన్లో నిర్వహిస్తున్నారు.

అంతేకాదు ఇంటర్వ్యూ పూర్తయ్యాక సదరు కంపెనీకి సంబంధించిన లెటర్ హెడ్ మీద ఆ ఉద్యోగానికి సంబంధించిన బేసిక్ పే మొదలగు వివరాలు అన్నీ క్లియర్ గా పొందుపరచిన వాటిని మీకు పంపుతారు.

అలా వారు పంపించిన కాల్ లెటర్ ని తీసుకొని కంపెనీకి వెళ్లగా అక్కడ అసలు నిజం బయట పడుతుంది.

అక్కడకు వెళ్లిన తర్వాత మోసపోయానని గ్రహించి చివరికి ఏమీ చేయలేక నిస్సహాయులుగా మిగిలిపోతున్నారు.

అయితే ఇందులో కొందరు ధైర్యం చేసి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిన వారిని ట్రేస్ చేయడం కాస్త ఇబ్బందిగా మారిపోయింది.

కాబట్టి ఇటువంటి పనులు జరిగేటప్పుడు కాస్త అప్రమత్తంగా ఉండి సైబర్ నేరగాళ్ల మోసాలు నుండి బయటపడండి.

పుష్ప ది రూల్ రీలోడెడ్ లో యాడ్ చేసిన సీన్స్ ఇవే.. ఓటీటీలో సైతం ఉంటాయా?