కామారెడ్డిలో అధిక లాభాల పేరుతో సైబర్ మోసం

కామారెడ్డి జిల్లాలో సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది.అధిక లాభాల పేరుతో కొందరు కేటుగాళ్లు అమాయకునికి టోకరా వేశారు.

ఇందులో భాగంగానే యాప్స్ లో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయంటూ యువకుడికి ఫోన్ చేశారు.

సైబర్ చీటర్స్ మాటలు నమ్మిన సదరు యువకుడు రూ.4 లక్షలు పెట్టుబడి పెట్టినట్లు తెలుస్తోంది.

లాభాలు రాకపోవడంతో మోసపోయానని గుర్తించిన బాధితుడి పోలీసులను ఆశ్రయించాడు.బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు కేటుగాళ్లు కోసం విస్తృతంగా గాలిస్తున్నారు.

బాలయ్య సినిమాకు పోటీగా ప్రభాస్ సినిమా రిలీజ్ కానుందా.. రిలీజయ్యేది అప్పుడేనా?