సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి:ఎస్పీ అఖిల్ మహాజన్

సోషల్ మీడియా( Social Media )లో ప్రకటనలు చూసి లేదా సోషల్ మీడియా గ్రూప్స్ లో అధిక లాభాలు ఆశ చూపించే మెసేజెస్ నమ్మి మోసపోకండి, సైబర్ మోసాల పట్ల అవగాహన కలిగి ఉండండి.

అప్రమత్తతతోనే సైబర్ మోసాలకు చెక్ పెట్టవచ్చు అని,జిల్లా పరిధిలో ఏరకమైన సైబర్ నేరాలు జరుగుతున్నాయో పత్రికా ప్రకటనల ద్వారా తెలియజేయడం జరుగుతుందని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్( SP Akhil Mahajan ) అన్నారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సైబర్ నేరగాళ్లు ఆశ, భయం అనే రెండు అంశాల మీద సైబర్ నేరస్తులు సైబర్ నేరాలు చేస్తున్నారు.

ఒక వ్యక్తికి ఏదైనా ఆశ చూపించి తక్కువ కాలంలో ఎక్కువ డబ్బులు వస్తాయని అతని నుండి వ్యక్తిగత సమాచారం తీసుకుని సైబర్ నేరం చేయడం జరుగుతుంది.

భయం ఏదైనా వ్యక్తికి సంబంధించిన బ్యాంకు అకౌంట్ కానీ, పాన్ కార్డు కానీ, ఇతర అకౌంట్లు బ్లాక్ అవుతుందని భయపెట్టి వారి నుంచి వ్యక్తిగత సమాచారం తీసుకొని సైబర్ నేరం చేస్తున్నారు.

ప్రస్తుత సమాజంలో ఇంటర్నెట్ ఉపయోగం పెరగడం వల్ల ప్రతి వ్యక్తి ఏదో అవసరానికి ఫోన్లు వాడడం జరుగుతుంది.

అదే అదునుగా సైబర్ నేరగాళ్లు మన వ్యక్తిగత సమాచారాన్ని దొంగలించి మన బ్యాంకులు, వ్యాలెట్స్ ఇతర వాటి నుండి డబ్బులు సులువుగా దోచేస్తున్నారు కావున మన వ్యక్తిగత సమాచారాన్ని ఎప్పుడు సామాజిక మాధ్యమాలలో పంచుకోకూడదు.

ఎందుకంటే సైబర్ నేరగాళ్లు( Cyber Criminals ) ఇలాంటి అవకాశాల కోసం వేచి చూస్తారు.

కావున ఫోన్లు వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.ఏదైనా సైబర్ క్రైమ్( Cyber Crime ) జరిగిన వెంటనే 1930 కి కాల్ చేస్తే మీరు పోగొట్టుకున్న డబ్బులను తిరిగి పొందేలా చేయవచ్చు.

H3 Class=subheader-styleరాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలో ఈవారం రోజులలో నమోదు అయిన కొన్ని సైబర్ కేసుల వివరాలు.

/h3p ●సిరిసిల్ల టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాధితునికి ఒక గుర్తు తెలియని నెంబర్ నుంచి ఫోన్ వచ్చి మీ భూమిలో 4G మరియు 5G సెల్ టవర్స్ ఇన్స్టాల్( 5G Cell Towers Install ) చేస్తాం.

దానికి మీకు 25 లక్షలు అడ్వాన్స్ గా ఇస్తామని,నెలకు 25,000/- రూపాయల రెంట్ చెల్లిస్తామని చెప్పి రిజిస్ట్రేషన్ కోసం 22,000/- రూపాయలు చెల్లించాలని చెప్పగా బాధితుడు ఆ మొత్తాన్ని చెల్లించి మోసపోతాడు.

● కొనరావుపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాధితుడు టెలిగ్రామ్( Telegram ) ద్వారా పార్ట్ టైం జాబ్ కోసం గుర్తు తెలియని లింకును క్లిక్ చేయడం ద్వారా టెలిగ్రామ్ లో గుర్తు గ్రూపులో జైన్ కావడం జరిగింది.

ఆ గ్రూప్ లో ఒక లింక్ పెట్టి అందులో తక్కువ మొత్తం లో పెట్టుబడి పెట్టి వెబ్సైట్ కి రేటింగ్ ఇవ్వడం ద్వారా మనీ క్రెడిట్ అవుతాయని అనగా బాధితుడు దఫా దఫా లుగా 7,46,000/- రూపాయలు పెట్టుబడిగా పెట్టి మోసపోతాడు.

● సిరిసిల్ల టౌన్ పరిధిలో బాధితుడు నటరాజ్ పెన్సిల్ కి సంబంధించిన యాడ్ ని ఫేస్బుక్ లో సంప్రదించాడు.

వర్క్ ఫ్రం హోం అని చెప్పి మెటీరియల్, ఐడి కార్డ్ మరియు ప్రాసెసింగ్ ఫ్రీ అని బాధితుని దగ్గర నుంచి 22,000/- రూపాయలు తీసుకొని మోసగించారు.

●వేములవాడ టౌన్ పరిధిలో బాధితుడు ఫాస్ట్ టాగ్ కస్టమర్ కేర్ నెంబర్ను గూగుల్లో సెర్చ్ చేసి సంప్రదించాడు.

బాధితుని బ్యాంకు వివరాలు షేర్ చేయడం వల్ల 7,500/- రూపాయలు నష్టపోయాడు.h3 Class=subheader-styleతీసుకోవలసిన జాగ్రత్తలు:-/h3p • మీకు లాటరి,లోన్ వచ్చిందని, కాల్ గాని మెసేజ్ గాని వచ్చిందా ?.

ఆశపడకండి, అనుమానించండి.వెంటనే 1930 కి కాల్ చేసి ఫిర్యాదు చెయ్యండి.

• అపరిచిత వ్యక్తుల నుండి వచ్చే వీడియో కాల్స్ లిఫ్ట్ చెయ్యకండి, చేస్తే వాళ్ళు నగ్నంగా ఉండి, మీకు చేసిన వీడియో కాల్ రికార్డు చేసి,మిమ్మల్ని బెదిరించి డబ్బులు లాగేస్తారు.

• వేలల్లో పెట్టుబడి లక్షల్లో లాభాలు అంటూ వచ్చే వాట్సాప్, టెలిగ్రామ్ ప్రకటనలను నమ్మకండి.

• తక్కువ డబ్బులు పెట్టినప్పుడు లాభాలు ఇచ్చి ఎక్కువ మొత్తంలో డబ్బులు పెట్టినప్పుడు డబ్బులు ఇవ్వకుండా మోసం చేస్తారు.

ఇలాంటి సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 కి కాల్ చెయ్యండి.• మీకు ఉద్యోగం ఇస్తాం అంటూ మెసేజెస్ చేసి, మిమ్మల్ని డబ్బులు కట్టమంటున్నారు అంటే వాళ్ళు సైబర్ మోసగాళ్ళు అని గ్రహించండి.

పోతారు మొత్తం పోతారు.. సరిపోదా శనివారం మూవీ ట్విట్టర్ రివ్యూ అదిరిపోయిందిగా!