కలెక్టర్ ఫేస్‌బుక్ హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు.. అంతటితో ఆగకుండా.. !

దేశంలో దొంగలు పడ్డారు అనే చిత్రం ఉందన్న విషయం తెలిసిందే.కానీ అది నిజమే అవుతుంది.

ప్రస్తుతం దేశంలో దొంగలు పడ్డారు.అందినకాడికి దోచుకుంటున్నారు.

ఇక ఆ దొంగతనాలు చేసే తీరును బట్టి వారి వృత్తికి పేర్లు కూడా పెట్టింది సమాజం.

ఇందులో భాగంగా ఈ మధ్యకాలంలో పుట్టుకొచ్చిన కొత్త నేరగాళ్ల పేరు సైబర్ నేరగాళ్లు అని పెట్టారు.

వీరు కంటికి కనిపించరు గానీ చేతికి చిక్కినవారిని చిక్కినట్లుగా దోచుకుంటారు.ఇకపోతే ఈ సైబర్ నేరగాళ్ల ఆగడాలు రోజు రోజుకు మితిమీరిపోతుండటంతో బాధితుల సంఖ్య కూడా పెరుగుతుంది.

ఇక సామాన్యుల దగ్గరి నుండి అధికారుల వరకు ఎవరిని వదలడం లేదు.తాజాగా విజయనగరం జిల్లా కలెక్టర్ ఎం.

హరిజవహర్ లాల్ ఫేస్‌బుక్ ఖాతాను హాక్ చేసిన సైబర్ నేరగాళ్లు ఆ అకౌంట్ నుండి కొంత మందికి డబ్బులు కావాలని మెసేజ్‌లు పెట్టడంతో ఏం అవసరం వచ్చిందో అని అతని స్నేహితులు నేరగాళ్లు డిమాండ్ చేసిన రూ.

10 వేలు, రూ.15 వేలు పంపిచారట.

అయితే ఈ విషయం కాస్త కలెక్టర్‌కు దృష్టికి వెళ్లడంతో వెంటనే తన ఫేస్‌బుక్ ఖాతాను మూసేసిన కలెక్టర్ హరిజవహార్ లాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

చూసారా ఇలాంటి మేసేజ్‌లు వస్తే ఫస్ట్ ఫోన్ చేసి తెలుసుకోవడం మంచిది.లేదా అనుమానం ఉంటే పోలీసులను సంప్రదించండని చెబుతున్నా మోసపోయే వారు మోసపోతూనే ఉన్నారు.

జాన్వీ కపూర్ ఎంట్రీతో ఆ హీరోయిన్ కు ఆఫర్లు తగ్గాయట.. అయ్యో పాపం అంటూ?