చెట్లు పెంచమంటూనే మరో వైపు నరికివేత.. నెట్టింట ఫొటో వైరల్

ఇటీవల కాలంలో భూతాపం భారీగా పెరిగిపోతోంది.వర్షాలు సరైన సమయంలో పడడం లేదు.

అనావృష్టి, అతివృష్టి పరిస్థితులు కనిపిస్తున్నాయి.ఇక అంటార్కిటికాలో మంచు కరుగుతోందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

మరో వైపు అడవులు తరిగిపోతుండడంతో జంతువులకు నిలువ నీడ దొరకడం లేదు.దీంతో అవి జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి.

మనుషులపై దాడి చేసి ప్రాణాలు తీస్తున్నాయి.చెట్లను నరికి వేయడం, అడవుల విస్తీర్ణం తగ్గిపోవడమే దీనికి కారణమని చెప్పొచ్చు.

అయితే కొందరు చెట్లు పెంచాలని సందేశాలిస్తున్నా, వారి చర్యలు అందుకు విరుద్ధంగా ఉన్నాయి.

దీనికి సంబంధించి ట్విట్టర్‌లో ఓ ఫొటో వైరల్ అవుతోంది.దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.

ఐఏఎస్ అవనీష్ శరణ్ ఇటీవల ఒక ఫోటోను షేర్ చేశారు.నరికివేయబడిన చెట్లతో నిండిన ట్రక్కుపై "మరిన్ని చెట్లను నాటండి" అనే కొటేషన్ రాసి ఉంది.

చాలా మంది వినియోగదారులు ఇది వ్యాపార వ్యూహం అని చమత్కరించారు.మరికొందరు ఎక్కువ చెట్లను నాటడం ఎలా అవసరమని కూడా సూచించారు.

ఐఏఎస్ అధికారి శరణ్ ఈ వైరల్ ఫోటోను ట్విట్టర్‌లో పంచుకున్నారు."వ్యంగ్యానికి నిర్వచనం" అని క్యాప్షన్‌గా రాశారు.

పోస్ట్‌కి 4,000 కంటే ఎక్కువ లైక్‌లు వచ్చాయి.400 సార్లు రీట్వీట్ చేయబడింది.

ఒక వినియోగదారుడు "తద్వారా మేము మా వ్యాపారంలో వృద్ధిని కొనసాగించగలము" అని ఫన్నీ కామెంట్ పెట్టాడు.

ఓ వైపు చెట్లు పెంచాలని వాహనం మీద కొటేషన్ రాసి, వారేమో చెట్లు నరికి తరలించడం ఆసక్తి రేపుతోంది.

అవనీష్ శరణ్ ఛత్తీష్‌గఢ్ కేడర్‌కు చెందిన 2009 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి.

తరచూ ఆయన ట్విట్టర్‌లో షేర్ చేసే ఫొటోలు, వీడియోలు ఆసక్తికరంగా, ఆలోచన రేకెత్తించే విధంగా ఉంటాయి.

షుగ‌ర్ వ్యాధి ఉన్న‌వారు పుచ్చ‌కాయ తినొచ్చా..?