సీతాఫలంతో కరోనాకు చెక్.. ఎలాగంటే..?
TeluguStop.com
ప్రపంచదేశాల్లో ఎక్కడ చూసినా.ప్రజల్లో కరోనా భయమే కనిపిస్తోంది.
ఈ మహమ్మారి ఎటు నుంచి వచ్చి ఎటాక్ చేస్తుందో తెలియక ప్రజలు వణికిపోతున్నారు.
కంటికి కనిపించని ఈ ప్రాణాంతక వైరస్ కరోనాకు ఇప్పటికే లక్షల మంది బలైపోయారు.
ఇంకెంత మందిని పొట్టనపెట్టుకుంటుందో అర్థం కావడం లేదు.మరోవైపు వ్యాక్సిన్ లేని ఈ కరోనా నుంచి రక్షించుకోవాలంటే.
శరీరంలో రోగనిరోధక శక్తి బలంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.ఇక రోగనిరోధక శక్తి పెరగాలంటే.
ప్రతిరోజు ఖచ్చితంగా పోషకాహారం తీసుకోవాలి.అలాంటి పోషకాహారాల్లో సీతాఫలం కూడా ఒకటి.
ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే సీతాఫలంలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది.
తద్వారా కరోనా వంటి భయంకర వైరస్‌ల నుంచి రక్షణ పొందవచ్చు. """/" /
అలాగే సీతాఫలంలో విటమిన్ సి తో పాటు పాస్ఫరస్, మెగ్రీషియం అధికంగా ఉంటాయి.
ఇవి గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటాయి.బరువు తగ్గాలనుకునే వారు సీతాఫలాన్ని డైట్‌లో చేర్చుకుంటే చాలా మంచిది.
ఎందుకంటే.ఇందులో కొవ్వూ, కెలొరీలు చాలా తక్కువగా ఉంటాయి.
మరియు తిన్న వెంటనే తక్షణ శక్తిని ఇస్తాయి.ఇక సీతాఫలంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కారకాలని దూరం చేస్తాయి.
ఐరన్ ఎక్కువగా ఉండే సీతాఫలాలు తినటం వల్ల అనీమియా వ్యాధి నుంచి రక్షించడంతో పాటు డయాబెటిస్ దరి చేరనివ్వదు.
రక్తహీనతతో బాధపడేవారు కూడా సీతాఫలం తీసుకుంటే చాలా మంచిదని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
మరో మూవీని మిస్ చేసుకున్న శ్రద్ధా కపూర్.. ఈ హీరోయిన్ వెళ్తున్న రూట్ రైటేనా?