రెగ్యుల‌ర్‌గా ఈ జ్యూస్ తాగితే..జుట్టు రాల‌మ‌న్నా రాల‌ద‌ట‌?

నేటి కాలంలో స్త్రీ, పురుషులను ప్ర‌ధానంగా వేధిస్తున్న స‌మ‌స్య హెయిర్ ఫాల్‌.ఒత్తిడి, బిజీ లైఫ్ స్టైల్‌, ఆహార‌పు అల‌వాట్లు, పోష‌కాల లోపం, కాలుష్యం, హెయిర్ కు యూజ్ చేసే షాంపూను త‌ర‌చూ మార్చ‌డం, అన‌వ‌స‌ర‌మైన విష‌యాల గురించి అతిగా ఆలోచించ‌డం, హార్మోన్ చేంజ‌స్‌ ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల హెయిర్ ఫాల్ ఇబ్బంది పెడుతుంటుంది.

ఇక ఈ స‌మ‌స్య‌ను నిర్ల‌క్ష్యం చేస్తే.జుట్టు క్ర‌మంగా ప‌ల్చ‌బ‌డిపోతుంది.

అందుకే హెయిర్ ఫాల్‌ను నివారించుకునేందుకు ర‌క‌ర‌కాల ప్ర‌యోగాలు చేస్తుంటారు.అయితే హెయిర్ ఫాల్‌కు చెక్ పెట్ట‌డంలో క‌రివేపాకు జ్యూస్ అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.

అవును, రెగ్యుల‌ర్‌గా ఒక క‌ప్పు చ‌ప్పున క‌రివేపాకు జ్యూస్ తీసుకుంటే.జుట్టు రాల‌మ‌న్నా రాల‌దు.

మరి ఇంత‌కీ క‌రివేపాకు జ్యూస్ ను ఎలా త‌యారు చేసుకోవాలి.? అన్న విష‌యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

ముందు ఫ్రెష్‌గా ఉండే క‌రివేపాకును తీసుకుని నీటిలో కడ‌గి.ఆ త‌ర్వాత మెత్త‌గా పేస్ట్ చేసుకుని ర‌సం తీసుకోవాలి.

"""/" / ఇప్పుడు ఒక గ్లాస్ లోకి క‌రివేపాకు ర‌సం తీసుకుని.అందులో పావు స్పూన్ జీల‌క‌ర్ర పొడి, చిటికెడు న‌ల్ల‌ ఉప్పు వేసి బాగా క‌లిపితే జ్యూస్ రెడీ అయిన‌ట్టే.

ఈ క‌రివేపాకు జ్యూస్‌ను ప్ర‌తి రోజు తీసుకుంటే.జుట్టుకు మంచి పోష‌ణ అందుతుంది.

దాంతో రాల‌డం త‌గ్గి.జుట్టు ఒత్తుగా, పొడవుగా పెర‌గ‌డం స్టార్ట్ అవుతుంది.

ఇక ఈ క‌రివేపాకు జ్యూస్‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌రిన్ని ప్ర‌యోజ‌నాలు కూడా ఉన్నాయి.

బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు క‌రివేపాకు జ్యూస్ తీసుకుంటే.ఒంట్లో పెరుకుపోయిన‌ కొవ్వంతా కురుగుతుంది.

అలాగే కంటి చూపు మెరుగు ప‌డుతుంది.శ‌రీరంలో టాక్సిన్లు బ‌య‌ట‌కు పోతాయి.

ఒత్తిడి, అందోళ‌న, త‌ల‌నొప్పి వంటి స‌మ‌స్య‌లు పరార్ అవుతాయి.శ‌రీంలో అధిక వేడి త‌గ్గుతుంది.

గుండె ఆరోగ్యం కూడా మెరుగు ప‌డుతుంది.కాబ‌ట్టి, హెయిర్ ఫాల్ ఉన్న వారే కాదు.

ఎవ్వ‌రైనా ఈ క‌రివేపాకు జ్యూస్ తీసుకోవచ్చు.

Mahesh Babu , Kasturi : మహేష్ కి జోడి గా చేయాల్సిన వయసు నాది..తల్లిగా ఎలా చేయగలను : కస్తూరి