మోకాళ్లు నల్లగా ఉన్నాయా.. కరివేపాకుతో నివారించుకోండిలా!
TeluguStop.com
సాధారణంగా కొందరి మోకాళ్లు నల్లగా ఉంటాయి.చర్మం మొత్తం తెల్లగా ఉండి మోకాళ్ల వల్ల మాత్రం నల్లగా ఉంటే ఎంత అసహ్యంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
అందుకే మోకాళ్ల నలుపును వదిలించుకునేందు నానా ప్రయత్నాలు చేస్తుంది.రక రకాల క్రీములు, లోషన్లు, స్క్రబ్బర్స్ యూజ్ చేస్తుంటారు.
కానీ, నిజానికి అందరి ఇళ్లల్లో ఉండే కరివేపాకుతో కూడా మెకాళ్ల నలుపుకు చెక్ పెట్టవచ్చు.
మరి కరివేపాకును ఎలా ఉపయోగించాలి అన్నది లేట్ చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం./br.
ముందుగా కరివేపాకు తీసుకుని ఎండ బెట్టి పొడి చేసుకోవాలి.ఇప్పుడు ఈ పొడిలో ఆలివ్ ఆయిల్ మరియు నిమ్మ రసం యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి.
ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని మోకాళ్లపై అప్లై చేసి.డ్రై అయిన తర్వాత తడి చేతితో స్క్రబ్ చేస్తూ కూల్ వాటర్‌తో క్లీన్ చేసుకోవాలి.
ఇలా ప్రతి రోజు చేస్తూ ఉంటే మోకాళ్ల నలుపు మటు మాయం అవుతుంది.
"""/"/
అలాగే కరివేపాకును ఎండ బెట్టి పొడి చేసుకుని.అందులో కలబంద జెల్ వేసి బాగా కలుపుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మోకాళ్లపై పూసి ఇరవై లేదా ముప్పై నిమిషాల పాటు ఆర నివ్వాలి.
ఆ తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రంగా వాష్ చేసుకోవాలి.ఇలా రెగ్యులర్‌గా చేసినా కూడా మోకాళ్ల నలుపు వదులుతుంది.
ఒక గిన్నె తీసుకుని అందులో కరివేపాకు పొడితో పాటు శెనగ పిండి, పెరుగు వేసి మిక్స్ చేసుకోవాలి.
ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని మోకాళ్లపై అప్లై చేసి పావు గంట పాటు వదిలేయాలి.
అనంతరం గోరు వెచ్చని నీటితో క్లీన్ చేసుకోవాలి.ఇలా ప్రతి రోజు చేయడం వల్ల నలుపు తగ్గడంతో పాటు మోకాళ్లు మృదువుగా, అందంగా మారతాయి.
మోచేతులు, మోకాళ్లు తెల్లగా మెరిసిపోవాలా.. అయితే ఇలా చేయండి!