డయాబెటిస్ ఉన్న‌వారు కరివేపాకు తింటే ఏం అవుతుందో తెలుసా?

మ‌ధుమేహం లేదా డ‌యాబెటిస్‌.నేటి కాలంలో చాలా చిన్న వ‌య‌సుకే ఈ స‌మ‌స్య బారిన ప‌డుతున్నారు.

ప్ర‌పంచ‌వ్యాప్తంగా డ‌యాబెటిస్ వ్యాధి గ్ర‌స్తులు కోట్ల మంది ఉన్నారు.శరీరంలో ఉండే గ్లూకోజ్ హెచ్చు తగ్గుల వల్ల డ‌యాబెటిస్ వ‌స్తుంటుంది.

మ‌ధుమేహం ఉంటే స్వీట్స్ కు దూరంగా ఉండాలి.మ‌రియు మందులు వాడుతూ ఉండాలి.

అయితే కొన్ని ఆహార ప‌దార్థాల‌ను డైట్‌లో చేర్చుకుంటే.డ‌యాబెటిస్ స‌మ‌స్య‌ను పూర్తిగా దూరం చేసుకోవచ్చు.

అలాంటి ఆహారంలో క‌రివేపాకు ఒక‌టి.డ‌యాబెటిస్ ఉన్న వారు క‌రివేపాకు ప్ర‌తి రోజు ఏదో ఒక రూపంలో తీసుకోవాలి.

ఇలా చేయ‌డం వ‌ల్ల ఇన్సులిన్ ను ఉత్పత్తి చేసే పాంక్రియెటిక్ సెల్స్ ను రెగ్యులేట్ అవుతాయి.

మ‌రియు బ్ల‌డ్ షుగ‌ర్ లెవ‌ల్స్ క్ర‌మంగా త‌గ్గిస్తాయి.యూరినరీ సమస్యలను కూడా కరివేపాకు దూరం చేస్తుంది.

అలాగే క‌రివేపాకుతో మ‌రిన్ని ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు కూడా ఉన్నాయి. """/"/ క‌రివేపాకు ప్ర‌తి రోజు తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ త‌గ్గించి.

గుండె పోటు, ఇత‌ర గుండె జ‌బ్బులు రాకుండా రక్షిస్తుంది.మ‌రియు అధిక బ‌రును కూడా త‌గ్గిస్తుంది.

ఇక డయేరియా స‌మ‌స్య‌ల‌ను దూరం చేయ‌డంలో క‌రివేపాకు అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.క‌రివేపాకును పేస్ట్‌లా చేసుకోవాలి.

ఆ పేస్ట్‌ను మ‌జ్జిగ‌లో క‌లిపి తీసుకోవాలి.ఇలా చేయ‌డం వ‌ల్ల డ‌యేరియా స‌మ‌స్య నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

అలాగే జీర్ణ స‌మ‌స్య‌లు ఉన్న వారు క‌రివేపాకు తీసుకుంటే చాలా మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు.

క‌రివేపాకులో ఉండే లాక్సేటివ్ మ‌ల‌బ‌ద్ధ‌కాన్ని దూరం చేస్తుంది.మ‌రియు గ్యాస్‌, ఎసిడిటీ వంటి జీర్ణ స‌మ‌స్య‌ల‌ను త‌గ్గిస్తుంది.

అదేవిధంగా, విట‌మిన్ సి ఉండే క‌రివేపాకు తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి బ‌ల‌ప‌డుతుంది.

ఇందులో ఉండే విట‌మిన్ ఎ కంటి ఆరోగ్యాన్ని మెరుగుప‌రుస్తుంది.

రామ్ చరణ్ బుచ్చి బాబు సినిమా లో నటించే స్టార్ నటులు వీళ్లే…