పంట పొలాల్లో మృత్యు పాశాలు గా పొంచి ఉన్న కరెంట్ తీగలు
TeluguStop.com
-ప్రాణాలు పోతే తప్ప పట్టించుకొర ప్రజాప్రతనిధులు,సెస్ అధికారులు.ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతులు.
రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sircilla ) ఎల్లారెడ్డిపేట మండలంలో ని పలు గ్రామాలలో పంట పొలాల వద్ద కరెంట్ తీగలు ఉయాలలను తలపిస్తున్నాయి.
అయిన ప్రజాప్రతినిధులు ఎవరు కూడా పట్టించుకోవడం లేదు.నాయకులు పోటోలకు పోజులు ఇచ్చుడు తప్ప ప్రజా సమస్యలను పట్టించుకునే నాథుడే కరువయ్యాడు అని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు.
మరో 20 రోజుల్లో వరి పంట పొలాలు కోతకు రానున్నాయి.చాలా రోజుల నుండి అనేక మంది రైతులు( Farmers )తమ పొలాల్లో కరెంట్ తీగలు వేలాడుతున్నాయి అని నాటు వేసినప్పటి నుండి ప్రజాప్రతినిధుల చుట్టూ,సెస్ అధికారులు చుట్టూ తిరిగిన లాభం లేకుండా పోతుందనీ రైతులు పేర్కొంటున్నారు.
వరి కోతకు వచ్చిన పంట పొలాలు హర్వెస్టర్ తో కోయడానికి చేతికందే ఎత్తులో వేలాడుతున్న విద్యుత్ వైర్లు తమను భయపెడుతున్నాయని రైతులు అంటున్నారు.
పై ఫోటో ఎల్లారెడ్డిపేట లో గల సెకండ్ బై పాస్ రోడ్ లో ఉన్న గుండం సత్యం రెడ్డి పొలంలో చేతికందే ఎత్తులో ఉన్నాయి.
వీటిని సరిచేయాలని సెస్ అధికారులను కలిసిన లాభం లేదని ఇప్పటికైనా సెస్ అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని కోరారు.
ఈ ఇయర్ ఇండస్ట్రీ హిట్ కొట్టే సినిమాలు ఇవేనా..?