తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు .రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమైన నేపథ్యంలో ఆయన శ్రేణులకు దిశానిర్దేశం చేసే పనిని చేపట్టారు.
భారీ ఎత్తున అందరికీ ఆహ్వానాలు పంపారు.కీలకమైన నాయకులకు ముందుగానే తెలిపారు.
చంద్రబాబు కూడా భారీ ఎత్తున ప్రిపేర్ అయ్యారు.ఇంత వరకు బాగానే ఉంది.
సుమారు మూడున్నర గంటలపాటు సాగిన ఈ వీడియో కాన్ఫరెన్స్.అనేక విషయాలపై చంద్రబాబు ప్రసంగించేందుకు చక్కని వేదిక అయింది.
ఇటీవల కాలంలో ఆయన ప్రసంగించే వేదికలు దొరక్క ఇబ్బంది పడుతున్నారు.ఈ క్రమంలో వీడియో కాన్ఫరెన్స్ లో తమ్ముళ్లను ఉద్దేశించి భారీ ఎత్తున ప్రసంగాలు దంచికొడుతున్నారు.
కరోనా నేపథ్యంలో వీసీలతో తన ఉద్దేశాలు పార్టీ లైన్‌లను.చంద్రబాబు తమ్ముళ్లకు వివరిస్తున్నారు.