కరెంట్ రాజకీయం.. ఎవరిది పైచేయి !

ఎన్నికలవేళ తెలంగాణలో పోలిటికల్ హిట్ రోజు రోజుకి మరింత అగ్గి రాజేస్తుంది.ముఖ్యంగా అధికార బి‌ఆర్‌ఎస్( Brs ) మరియు కాంగ్రెస్( Congress ) మద్య విమర్శలు ప్రతి విమర్శలు, ఆరోపణలు ప్రతి విమర్శలు క్షణ క్షణం హాట్ టాపిక్ గా నిలుస్తున్నాయి.

ముఖ్యంగా ఈ మద్య తెలంగాణలో కరెంట్ అంశం తరచూ చర్చనీయాంశం అవుతోంది.తెలంగాణలో 24 గంటల కరెంట్ అమలు కావడం లేదని, కే‌సి‌ఆర్( KCR ) కరెంట్ పేరుతో మబ్య పెడుతున్నారని కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తోంది.

అయితే కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్నాటక వంటి రాష్ట్రలో అక్కడి ప్రభుత్వం ఎన్ని గంటలు కరెంట్ ఇస్తోందని బి‌ఆర్‌ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు.

"""/" / ఇక కరెంట్ పై రచ్చ రోజురోజుకూ పెరుగుతోంది.రాష్ట్రంలో రైతు సంక్షేమంగా వ్యవసాయాన్ని దృష్టిలో ఉంచుకొని 24 గంటల ఉచిత విద్యుత్ పథకానికి శ్రీకారం చుట్టారు కే‌సి‌ఆర్.

పథకం ప్రారంభం నుంచి ఇప్పటివరకు కూడా సక్రమంగా అమలౌతోందని, 24 గంటల ఉచిత కరెంట్ పట్ల ప్రజలు సానుకూలంగా ఉన్నారని కే‌సి‌ఆర్ అండ్ కొ.

నొక్కి చెబుతున్నారు.కానీ కరెంట్ విషయంలో కాంగ్రెస్ మాత్రం ఆచితూచి అడుగులు వేస్తోంది.

కర్నాటకలో 5 గంటల కరెంట్ మాత్రమే వస్తుండడంతో హస్తంపార్టీ తెలంగాణలోకి వస్తే కరెంట్ కోతలు తప్పవనే అభిప్రాయాలూ వ్యక్తమౌతున్నాయి.

"""/" / ఎందుకంటే ఇప్పటివరకు మేనిఫెస్టోలో గాని, నేతలు ప్రకటించిన హామీలలో గాని ఎక్కడ కూడా కరెంట్ పై పూర్తి స్థాయిలో స్పందించడం లేదు హస్తం నేతలు.

కానీ ఇటీవల రేవంత్ రెడ్డి ( Revanth Reddy )మాట్లాడుతూ 24 గంటల ఉచిత కరెంట్ పేటెంట్ అంతా కాంగ్రెస్ పార్టీదేనని, తాము అధికారంలోకి వస్తే నిరంతర విధ్యుత్ ఇస్తామని ప్రకటించారు.

అయితే ఆ మద్య ఓ టీవి చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఉచిత కరెంట్ అమలు పై ఆచితూచి స్పందించారు రేవంత్ రెడ్డి.

దీంతో కరెంట్ విషయంలో కాంగ్రెస్ క్లారిటీగా లేదా అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి.బి‌ఆర్‌ఎస్ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ కాంగ్రెస్ కహానీల పార్టీ అని విమర్శలు గిప్పిస్తోంది.

మరి ప్రస్తుతం రాష్ట్రంలో రాజుకున్న కరెంట్ వేడి ఎంకెలాంటి కొత్త చర్చలకు దారి తీస్తుందో చూడాలి.

మూవీ మేకర్స్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన తమన్.. పెళ్లి ఒకరితో ఫస్ట్ నైట్ ఒకరితో అంటూ!