మొన్నటి వరకు రూ. 30 ఉండే ఆ పాలు ఇప్పుడు రూ. 300 అయ్యాయట..ఎందుకో మరి?

వర్ష కాలం స్టార్ట్ అయ్యిందంటే వైరల్ ఫీవర్స్ స్టార్ట్ అవుతాయి.ఆ వైరల్ ఫీవర్స్ లో డెంగీ చాలా ప్రమాదం కరమైనది.

డెంగీ ఫెవర్ వచ్చిందంటే ముందుగా ప్లేట్ లెట్స్ పడిపోతాయి.శరీరంలో ప్లేట్ లెట్స్ పడిపోతే చాలా డెంజరస్ అవుతుంది.

కొంత మంది అయితే డెంగీ ఫీవర్ తో చనిపోతున్నారు.సరైన వైద్యం అందక పోతే ప్రాణాలకు ప్రమాదం వాటిల్లుతుంది.

అందుకే డెంగీ ఫీవర్ వచ్చిన వారు సకాలంలో వైద్యం అందుకోక పోతే డెంజర్ అవుతుంది.

ఇక గత కొన్ని రోజులుగా మధ్యప్రదేశ్ లో కూడా డెంగీ కేసులు ఎక్కువ అవుతున్నాయి.

డెంగీ ఫీవర్ పేరు వింటేనే అక్కడి ప్రజలు వణికి పోతున్నారు.మధ్యప్రదేశ్ లోని చత్తార్ పూర్ లో డెంగీ కేసుకు రోజురోజుకూ అధికమవుతున్నాయి.

ఈ డెంగీ జ్వరం వచ్చిన వారికీ ప్లేట్ లెట్స్ భారీగా పడిపోతున్నాయి. """/"/ దీంతో అక్కడి ప్రజలు వైద్యం తో పాటు ప్లేట్ లెట్స్ పెరగడం కోసం మరొకటి కూడా వాడుతున్నారు.

ఏం వాడుతున్నారా అని ఆలోచిస్తున్నారా.అక్కడి ప్రజలు డెంగీ ఫీవర్ వచ్చిన వారు ప్లేట్ లెట్స్ పెరగడం కోసం మేక పాలను వాడుతున్నారట.

అయితే డెంగీ ఫీవర్ వచ్చిన వారంతా మేక పాలను వాడడం వల్ల వీటికి డిమాండ్ భారీగా పెరిగింది.

"""/"/ మొన్నటి వరకు ఈ పాలు 30 రూపాయలు మాత్రమే ఉండేవి.కానీ ఇప్పుడు డెంగీ వచ్చిన వారు మేక పాలు వాడుతుండడంతో ఈ పాల ధరకు రెక్కలు వచ్చాయి.

మేక పాలు తాగితే ప్లేట్ లెట్స్ పెరుగుతాయని అందరు చెప్పడంతో ఈ పాలను వాడడం స్టార్ట్ చేసారు.

దీంతో 30 రూపాయలకు లభించే మేక పాలు ఏకంగా 300 రూపాయలు అమ్ముతున్నారట.

మాములుగా అయితే మేక పాలు ఆరోగ్యానికి మంచిది అయినా కూడా తాగేందుకు పెద్దగా ఆసక్తి కనబర్చరు.

కానీ ఇప్పుడు డెంగీ రావడంతో వీటిని తాగడం మొదలు పెట్టారు.

ఉదయం సమయంలో ఖాళీ కడుపుతో తీసుకోవాల్సిన ఆహారాలు ఇవే..!