మెరిసే చర్మం కోసం పెరుగు ఫెస్ పాక్స్

ప్రతి మహిళ అందమైన, మెరిసే చర్మాన్ని కోరుకుంటుంది.ఆలా ఉండటానికి ఏమి చేయటానికి అయినా సిద్ధంగా ఉంటుంది.

చాలా మంది మహిళలు చర్మ సంరక్షణ కోసం ఎంతో డబ్బును సమయాన్ని వృధా చేసేస్తూ ఉంటారు.

ఆలా వృధా చేయకుండా మన ఇంటిలో అందుబాటులో ఉండే పెరుగుతో ప్యాక్స్ వేసుకుంటే మెరిసే చర్మం మీ సొంతం అవుతుంది.

పెరుగులో ఉండే బ్యాక్టీరియా వ్యతిరేక, బ్లీచింగ్ లక్షణాలు నిర్జీవంగా ఉన్న చర్మంపై అద్భుతాలు చేస్తాయి.

ఇపుడు ఆ పాక్స్ గురించి వివరంగా తెలుస్కుందాం.ఒక స్పూన్ పెరుగులో అరస్పూన్ నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించి అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఈ ప్యాక్ ని వారంలో రెండు సార్లు వేస్తూ ఉంటే మంచి ఫలితం కనపడుతుంది.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px""/" / రాత్రి సమయంలో మెంతులను నానబెట్టి మరుసటి రోజు మెత్తని పేస్ట్ గా చేసి పెరుగులో కలిపి ముఖానికి పట్టించి అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఈ ప్యాక్ ని వారంలో రెండు సార్లు వేస్తూ ఉంటే ముఖంలో డల్ నెస్ పోయి ఉత్తేజం వస్తుంది.

!--nextpage ఒక స్పూన్ పెరుగులో అరస్పూన్ ఆలివ్ ఆయిల్ ని కలిపి ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఈ ప్యాక్ ని వారంలో రెండు సార్లు వేస్తూ ఉంటే ముఖం మెరిసిపోతుంది.రెండు స్పూన్ల పెరుగులో అరస్పూన్ తేనే కలిపి ముఖానికి పట్టించి 10 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఈ ప్యాక్ ని వారంలో ఒకసారి వేస్తె మెరిసే చర్మం మీ సొంతం అవుతుంది.

నువ్వుల నూనెలో వీటిని కలిపి తలకు రాశారంటే మీ జుట్టు రెట్టింపు అవుతుంది!