పెరుగుతో వీటిని కలిపి ముఖానికి రాస్తే.. చర్మం మెరిసిపోవాల్సిందే!!
TeluguStop.com

ముఖం అందంగా, మిలమిలా మెరిసిపోవాలని అందరూ కోరుకుంటారు.కానీ, అందుకు భిన్నంగా చర్మం ఉంటుంది.


ఎప్పుడు ఏదో ఒక చర్మ సమస్య వెంటాడుతూ ఉంటుంది.ముఖ్యంగా డ్రై స్కిన్, మోటిమలు, మచ్చలు, పిగ్మెంటేషన్ ఇలా ఎన్నో సమస్యలు వేధిస్తుంటాయి.


ఇవి సాధారణ సమస్యలే.కానీ, చాలా ఇబ్బంది పెడుతుంటాయి.
ఫలితంగా, ఈ సమస్యలను తక్షణమే పరిష్కరించుకోవాలని.మార్కెట్లో అందుబాటులో ఉన్న ప్రతి ఉత్పత్తిని ప్రయత్నించి భంగపడతాము.
అయితే ఎలాంటి చర్మ సమస్యలైనా ఇప్పుడు చెప్పుకోబోయే సింపుల్ టిప్స్‌తో చెక్ పెట్టవచ్చు.
పెరుగు ఆరోగ్యానికి కాదు.చర్మ సౌందర్యాన్ని రెట్టింపు చేయడంలోనూ గ్రేట్‌గా సహాయపడుతుంది.
ముఖ్యంగా పెరుగులో కొన్ని పదార్థాలు మిక్స్ చేసి వాడడం వల్ల అద్భుత ఫలితాలు పొందొచ్చు.
అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా పెరుగు మరియు పసుపు.
ఈ రెండిటిని మిక్స్ ముఖానికి పట్టించాలి.బాగా ఆరిన తర్వాత చల్లటి నీటితో క్లీన్ చేసుకోవాలి.
ఇలా చేయడం వల్ల ముఖంపై ఉన్న మొటిమలు, మచ్చలు క్రమంగా తగ్గుముఖం పడతాయి.
పెరుగులో ఎగ్ వైట్, ఉప్పు, పంచదార వేసి.బాగా మిక్స్ చేయాలి.
ఈ మిశ్రమాన్ని మాస్కులా ముఖానికి అప్లై చేసి.అరగంట తర్వాత ముఖాన్ని గోరువెచ్చిన నీటితో క్లీన్ చేసుకోవాలి.
ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల ముడతలు తగ్గి ముఖం యవ్వనంగా మారుతుంది.
మరియు ముఖం మృదువుగా, కాంతివంతంగా తయారువుతుంది.ఇక పెరుగులో కొద్దిగా ఓట్స్ పొడి, శెనగపిండి కలిపి ముఖానికి పట్టించాలి.
అరగంట పాటు ఆరనిచ్చి.అనంతరం చల్లటి నీటితో రుద్దుకుంటూ క్లీన్ చేసుకోవాలి.
ఇలా వారానికి మూడు సార్లు చేయడం వల్ల ముఖం తెల్లగా, అందంగా మారుతుంది.
బ్లాక్ స్పాట్స్ కూడా దూరం అవుతాయి.
కమల్ హాసన్ కి భారీ సక్సెస్ దక్కుతుందా..?