అండు కొర్రల సాగు చేసే విధానం.. మేలైన యాజమాన్య పద్ధతులు..!

వ్యవసాయం అంటే కత్తి మీద సాము లాంటిదే.వాతావరణ మార్పులు, పరిస్థితులు వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టాయి.

పండించిన పంట చేతికి వస్తుందని నమ్మకం లేకున్నా రైతు వ్యవసాయం( Peasant Farming ) చేసి ప్రపంచాన్ని పోషిస్తున్నాడు.

నేల యొక్క స్వభావాన్ని బట్టి, నీటి వనరులను బట్టి ఏ పంట వేయాలో నిర్ధారించుకున్నాకే సాగు చేయాలి.

పొలంలో నీటి వనరులు లేకపోతే వర్షాదారిత పంటలైన పంటలను వేయడం శ్రేయస్కరం.అయితే మార్కెట్లో మంచి డిమాండ్ ఉండే పంటలను ఎంపిక చేసుకుని వాటిని సాగు చేస్తేనే లాభాలు పొందే అవకాశం ఉంటుంది.

అండు కొర్రలకు( Andu Korra ) మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది.ఈ పంటను ఎలా సాగు చేయాలో పూర్తిగా తెలుసుకుందాం.

"""/" / పొలంలో సారం లేకపోయినా, తక్కువ నీటి లభ్యత ఉన్న, వాతావరణం లో మార్పులు సంభవించిన వాటినన్నిటిని అండు కొర్ర పంట తట్టుకొని దిగుబడి ఇస్తుంది.

ఈ పంటను లోతట్టు, వర, ముంపు ప్రాంతాలలో సాగు చేయవచ్చు.వర్షాధారంగా ఈ పంటను మే నుంచి ఆగస్టు నెలల మధ్య సాగు చేయవచ్చు.

గొర్రు ద్వారా ఈ కోర్ర విత్తనం వేస్తారు.మొక్కల మధ్య ఏడు సెంటీమీటర్ల దూరం, మొక్కల సాళ్ల మధ్య 30 సెంటీమీటర్ల దూరం ఉండేటట్లు విత్తుకోవాలి.

"""/" / గురు ద్వారా విత్తనం ఏస్తే ఒక ఎకరాకు మూడు కిలోల విత్తనాలు ( Three Kg Of Seeds )సరిపోతాయి.

అలాకాకుండా వెదజల్లే పద్ధతిలో అయితే ఐదు కిలోల విత్తనాలు అవసరం.ఒక ఎకరం పొలంలో నాలుగు టన్నుల ఎరువుల పశువులు వేసి కలియదున్నాలి.

వీటితోపాటు ఐదు కిలోల నత్రజని( Nitrogen ), ఐదు కిలోల భాస్వరం ఎరువులను విత్తేటప్పుడు వేయాలి.

కోర్ర విత్తనాలు విత్తిన 25 రోజుల తర్వాత పొలంలో మరో ఎనిమిది కిలోల నత్రజనిని వేయాలి.

ఈ అండు కొర్రను ఏక పంటగా, మిశ్రమ పంటగా సాగు చేసుకోవచ్చు.ఈ అండు కొర్ర పంటలో ఒకసారి కలుపు తీసిన తర్వాత వర్షం పడకపోతే ఒక నీటి తడి అందించిన మంచి దిగుబడి పొందవచ్చు.

ఈ పంట 85 రోజులలో కోతకు వస్తుంది.ఒక ఎకరం పొలంలో దాదాపుగా ఎనిమిది క్వింటాళ్ల ధాన్యం దిగుబడి పొందవచ్చు.

ఈ దేశంలో ట్రాఫిక్ చాలా ఎక్కువ.. ఆఫీసుకు నీళ్లలో ఈత కొట్టుకుంటూ వెళ్తారు..?