ఖరీఫ్ లో టమాటా నారుమడి పెంపకంలో మెళుకువలు..!
TeluguStop.com
వ్యవసాయంలో అధిక విస్తీర్ణంలో సాగు అవుతున్న పంటలలో టమాట పంట( Tomato ) కూడా ఒకటి.
టమాటా పంట అధిక ఉష్ణోగ్రత లేదా అధిక వర్షపాతంను అస్సలు తట్టుకోలేదు.ఖరీఫ్ లో కురుస్తున్న అధిక వర్షాల వల్ల టమాటా మొక్క ఎదుగుదల క్షీణించడంతోపాటు పూత, పిందె రాలిపోవడం వలన ఆశించిన స్థాయిలో రైతులు దిగుబడులు సాధించలేక తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారువానాకాలంలో సాగు చేయాలనుకుంటే జూన్ మొదటి పక్షం నుండి జూలై రెండవ పక్షం వరకు టమాటా పంట విత్తుకోవచ్చు.
వానాకాలం సాగుకు అనువైన టమాటా రకాల విషయానికి వస్తే.అర్క మేఘాలి, పూసా ఎర్లీ ద్వార్ప్, యుఎస్ 440, రూపాలి లలో ఏదో ఒక దానిని సాగుకు ఎంపిక చేసుకోవాలి.
"""/"/
ఒక కిలో విత్తనాలకు( TOmato Seeds ) 3గ్రా.మెటాలాక్సిల్, రెండు గంటల తర్వాత 4గ్రా.
ట్రైకోడెర్మా విరిడి తో విత్తన శుద్ధి చేయాలి.ఆ తరువాత 5గ్రా.
ఇమిడా క్లోప్రిడ్ ను విత్తనాలకు పట్టించాలి.పొలంలో సూర్యరశ్మి మరియు గాలి బాగా వీచే ప్రాంతంలో నారుమడి ఏర్పాటు చేసుకోవాలి.
ఒక ఎకరం పంటకు నాలుగు మీటర్ల పొడవు, ఒక మీటర్ వెడల్పు, ఐదు సెంటీమీటర్ల ఎత్తు ఉండే పది నారుమళ్ళను ఏర్పాటు చేసుకోవాలి.
నారుకు నారు కుళ్ళు రాకుండా ఉండడం కోసం 3గ్రా కాపర్ ఆక్సి క్లోరైడ్ ను ఒక లీటరు నీటిలో కలిపి ఆ ద్రావణంతో నారుమడిని తడపాలి.
"""/"/
ఆ తర్వాత విత్తనాలను నారుమడిలో కాస్త పలచగా చల్లుకోవాలి.రసం పీల్చే పురుగుల నివారణకు విత్తిన 20 రోజులకు కార్బోఫ్యూరాన్ 3జి ఈగలు 100 గ్రాముల.
చొప్పున వేసి నీరు పెట్టాలి.నారు వయసు 21 నుంచి 25 రోజుల మధ్య ఉన్నప్పుడు, మొక్కకు మూడు లేదా నాలుగు ఆకులు ఉన్నప్పుడు పీకి ప్రధాన పొలంలో నాటుకోవాలి.
పీకడానికి మూడు రోజుల ముందు ఒక లీటరు నీటిలో రెండు మిల్లీలీటర్ల డైమితోయెట్ కు 1గ్రా.
కార్బండిజం ను కలిపి నారుకు పిచికారి చేయాలి.