ఎనిమిది వందల ఎకరాల భూమి సాగు నీటితో సాగు చేసుకుందాం – ఒగ్గు బాలరాజు యాదవ్

రాజన్న సిరిసిల్ల జిల్లా: న్యాయ బద్దంగా మన ఎల్లారెడ్డి పేట గ్రామానికి సింగ సముద్రం నుండి రావలసిన నీటితో మన గ్రామంలోని 800ఎకరాల పై చిలుకు భూమిని సాగు చేసుకుందామని సింగ సముద్రం కనెక్టింగ్ కాలువల పూడికతీత చైర్మన్ ఒగ్గు బాలరాజు యాదవ్ అన్నారు.

ఈ మేరకు బాలరాజు యాదవ్ రైతులతో కిష్టం పల్లి లో సమావేశమయ్యారు.మొదటి రోజులో బాగంగా దుబ్బ కాలువ,(కిష్టం పల్లి కాలువ) బొజార్ల పై కాలువ, బోజార్లా కింది కాలువ లలో పేరుకుపోయిన పూడిక తీత చేయాలని ఆయా కాలువలను అవసరం మేరకు ఉపాధి కూలీలతో లేదా జేసిబి చైన్ యంత్ర సహకారంతో కాలువల పూడికతీత పనుల కోసం వినియోగించాలని నిర్ణయించడం జరిగింది.

సింగ సముద్రం నుండి ఎల్లారెడ్డి పేట గ్రామ శివారులో గల ఎర్ర కాలువ పంపుల వరకు నీటిని తీసుకురావడానికి అంతేర్పుల దుర్గయ్య కు ఏకరాన నాలుగు బుడ్లు వడ్లు పెట్టాలని రైతులు నిర్ణయించడం జరిగింది.

బాలరాజు యాదవ్ వెంట మాజీ ఆదర్శ రైతు బాలయ్య గారి గోపాల్ రెడ్డి, పయ్యావుల దేవయ్య, కొర్ర వేణు యాదవ్, ముద్ధం వెంకటి యాదవ్,గుడి విఠల్ రెడ్డి,జీడి రాజు యాదవ్, గుడి తిరుపతి రెడ్డి ఆరే నర్సింలుయూత్ కాంగ్రెస్ మాజీ మండల అద్యక్షులు,బుచ్చి లింగు సంతోష్ గౌడ్ తో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు.

వైరల్: ఓరినాయనో.. ఇదేం వంకాయ రా బాబు.. బాహుబలి వంకాయలా ఉందే..