స్ట్రెచ్ మార్క్స్ ను ఎఫెక్టివ్‌గా నివారించే కీర‌దోస‌.. ఎలాగంటే?

స్ట్రెచ్ మార్క్స్.ప్రెగ్నెన్సీ స‌మ‌యంలో మ‌రియు డెలివ‌రీ అయిన త‌ర్వాత ఆడ‌వారిని తీవ్రంగా వేధించే స‌మ‌స్య‌ల్లో ఇది ఒక‌టి.

పొట్ట, తొడలు, చేతులు ఇలా ఎక్కడపడితే అక్కడ చార‌లుగా ఏర్ప‌డ‌తాయి.వాటినే స్ట్రెచ్ మార్క్స్ అని అంటారు.

చర్మం ఒకేసారి బాగా సాగడం వల్ల ఈ స్ట్రెచ్‌ మార్క్స్‌ వస్తాయి.వీటిని త‌గ్గించుకునేందుకు ర‌క‌ర‌కాల క్రీములు, ఆయిల్స్ ఇలా ఏవేవో వాడుతుంటారు.

కొంద‌రు మ‌హిళ‌లు స్ట్రెచ్ మార్క్స్‌ను నివారించుకునేందుకు ఆప‌రేష‌న్ కూడా చేయించుకుంటారు.కానీ, వాస్త‌వానికి కొన్ని కొన్ని న్యాచుర‌ల్ టిప్స్ పాటిస్తే.

స్టెచ్ మార్క్స్‌ను త్వ‌ర‌గా త‌గ్గించుకోవ‌చ్చు.ముఖ్యంగా కీర‌దోస స్ట్రెచ్ మార్క్స్‌ను దూరం చేయ‌డంలో ఎఫెక్టివ్‌గా ప‌ని చేస్తుంది.

కీర దోసలో విటమిన్ సి, విటమిన్ ఎ తో పాటు సహజసిద్ధమైన యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్క‌లంగా ఉంటాయి.

ఇవి చర్మ స‌మ‌స్య‌ల‌ను దూరంగా చేయ‌డంలో అద్భుతంగా స‌హాయ‌ప‌డ‌తాయి.మ‌రి కీర దోసను స్ట్రెచ్ మార్క్స్ నివార‌ణ‌కు ఎలా యూజ్ చేయాలి అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం.

"""/" / ముందుగా కీర దోస ముక్క‌లును పేస్ట్ చేసి ర‌సం తీసుకోవాలి.

ఆ ర‌సంలో కొద్దిగా నిమ్మ ర‌సం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.స్ట్రెచ్ మార్క్స్‌ని తగ్గించడంలో నిమ్మరసం కూడా బాగా పని చేస్తుంది.

ఇప్పుడు త‌యారు చేసుకున్న కీరా మిశ్ర‌మాన్ని స్ట్రెచ్ మార్క్స్ ఉన్న ప్రాంతంలో అప్లై చేయాలి.

ఒక గంట లేదా గంట త‌ర్వాత చ‌ల్ల‌టి నీటితో క్లీన్ చేసుకోవాలి.ఇలా రోజుకు రెండు సార్లు చేయ‌డంలో వ‌ల్ల స్ట్రెచ్ మార్క్స్ క్ర‌మంగా త‌గ్గిపోతాయి.

ఇక కీర దోస‌ను తీసుకుని శుభ్రం చేసుకుని మెత్త‌గా పేస్ట్ చేసేసుకోవాలి.ఈ కీరా పేస్ట్‌లో క‌ల‌బంద గుజ్జు, పెరుగు వేసి బాగా క‌లుపు కోవాలి.

ఈ మిశ్ర‌మానికి స్ట్రెచ్ మార్క్స్ ఉన్న ప్రాంతాల్లో అప్లై చేసి.ఇర‌వై లేదా ముప్పై నిమిషాల పాటు ఆర‌నివ్వాలి.

అనంత‌రం గోరు వెచ్చ‌ని నీటితో శుభ్రం చేసుకోవాలి.ప్ర‌తి రెగ్యుల‌ర్‌గా చేసినా స్ట్రెచ్ మార్క్స్ త‌గ్గుముఖం ప‌డ‌తాయి.

క్యారెట్ తో ఆరోగ్యమే కాదు జుట్టును కూడా పెంచుకోవ‌చ్చు.. ఇంతకీ ఎలా వాడాలంటే?