మెడ న‌లుపును వ‌దిలించే దోస‌కాయ‌..ఎలాగంటే?

మెడ న‌లుపు.చాలా మంది ఎదుర్కొంటున్న కామ‌న్ స‌మ‌స్య‌.

ముఖ్యంగా స్త్రీల‌లో ఈ స‌మ‌స్య అత్య‌ధికంగా క‌నిపిస్తుంటుంది.ముఖం అందంగా, తెల్ల‌గా, మృదువుగా ఉండి.

మెడ మాత్రం న‌ల్ల‌గా ఉంటే చూసేందుకు ఎంత అస‌హ్యంగా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.

పైగా మెడ న‌ల్ల‌గా ఉంటే ఖ‌రీదైన ఆభ‌ర‌ణం వేసుకున్నా.అంద‌మే ఉండ‌దు.

అందుకే మెడ న‌లుపును త‌గ్గించుకునేందుకు ఆ క్రీము, ఈ క్రీము వాడుతుంటారు.అయితే మెడ న‌లుపును స‌హ‌జంగానే వ‌దిలిండ‌చంలో దోస‌కాయ అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.

మ‌రి మెడ‌కు దోస‌కాయ‌ను ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. """/" / ముందుగా కొన్ని దోస‌కాయ ముక్క‌ల‌ను తీసుకుని మిక్సీలో వేసి మెత్త‌గా పేస్ట్ చేసుకోవాలి.

ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ చ‌క్కెర మ‌రియు రెండు స్పూన్ల నిమ్మ ర‌సం యాడ్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని మెడ‌కు అప్లై చేసి.మెల్ల మెల్ల‌గా వేళ్ల‌తో స్క్ర‌బ్ చేసుకోవాలి.

రెండు, మూడు నిమిషాలు స్క్ర‌బ్ చేసి.బాగా డ్రై అయిన అనంత‌రం చ‌ల్ల‌టి నీటితో క్లీన్ చేసుకోవాలి.

ఇలా రోజుకు ఒక సారి చేస్తే.న‌లుపు పోయి మెడ తెల్ల‌గా మారుతుంది.

అలాగే దోస‌కాయ ముక్క‌ల‌ను మెత్త‌గా నూరి ర‌సం తీసుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్‌లో రెండు స్పూన్ల దోస‌కాయ రాసం, రెండు స్పూన్ల బంగాళ‌దుంప ర‌సం తీసుకుని క‌లుపుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని దూది సాయంతో మెడ‌కు అప్లై చేసి.ఇర‌వై, ముప్పై నిమిషాల త‌ర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఇలా రెగ్యుల‌ర్‌గా చేసినా మెడ న‌లుపు త‌గ్గుతుంది. """/" / ఇక ఒక బౌల్‌లో రెండు స్పూన్ల దోస‌కాయ ర‌సం, ఒక స్పూన్ చ‌ప్పున‌ ఓట్స్ పొడి, తేనె వేసుకుని మిక్స్ చేసుకోవాలి.

ఆ త‌ర్వాత ఈ మిశ్ర‌మాన్ని మెడ‌కు ప‌ట్టించి.కాస్త ఆరిన త‌ర్వాత త‌డి చేతుల‌తో స్క్ర‌బ్ చేసుకుంటూ గోరు వెచ్చ‌ని నీటితో క్లీన్ చేసుకోవాలి.

ఇలా ప్ర‌తి రోజు చేసినా కూడా మెడ న‌లుపు వ‌దులుతుంది.

మొదలైన వరలక్ష్మి పెళ్లి సందడి.. వైరల్ అవుతున్న ప్రీ వెడ్డింగ్ ఫోటోస్!