సిఎస్ఆర్ 762 ఎలక్ట్రిక్ బైక్ ఫీచర్స్ అదుర్స్..!

ప్రస్తుతం భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల( Electric Vehicles ) హవా నడుస్తోంది.

వాహన తయారీ కంపెనీలు సరికొత్త ఫీచర్లతో ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్లోకి విడుదల చేసి వాహనదారులను ఆకట్టుకునే పనిలో ఉన్నారు.

అహ్మదాబాద్( Ahmedabad ) కు చెందిన స్టార్టప్ కంపెనీ స్విచ్ మోటో కార్ప్ నుంచి ఓ సరికొత్త ఎలక్ట్రిక్ బైక్ మార్కెట్లోకి అడుగు పెట్టేందుకు సిద్ధంగా ఉంది.

ఆ బైక్ కు సంబంధించిన సరికొత్త ఫీచర్లు ఏమిటో చూద్దాం. """/" / స్విచ్ మోటో కార్ప్ తాజాగా సిఎస్ఆర్ 762 ఎలక్ట్రిక్ బైక్ ( CSR 762 Electric Bike )ను భారత మార్కెట్లో త్వరలోనే ఆవిష్కరించబోతోంది.

ఈ బైక్ ఫీచర్ల విషయానికి వస్తే.సిగ్నేచర్ ఎల్ఈడీ, డీఆర్ఎల్ డిజైన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

3kW PMS ఎలక్ట్రిక్ మోటార్ ను కలిగి ఉండి 3,800RPM వద్ద 13.

4bhp గరిష్ట శక్తిని ఉత్పత్తి చేస్తుంది.165 టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.

"""/" / ఒక గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.ఈ బైక్ లో 40 లీటర్ బూట్ స్పేస్ మొబైల్ చార్జర్( Boot Space Mobile Charger ) పూర్తిగా కవర్ అయినా మొబైల్ హోల్డర్ ఫీచర్ కూడా ఉంది.

2024 సంవత్సర ప్రారంభంలో ఈ బైక్ మార్కెట్లోకి అడుగుపెట్టే అవకాశం ఉంది.ప్రస్తుతం మార్కెట్లో వినియోగదారులు పెట్రోల్, డీజిల్ తో నడిచే వాహనాలను కొనేందుకు ఆసక్తి చూపించడం లేదు.

కొనుగోలుల పరంగా చూస్తే ఎలక్ట్రిక్ వాహనాల సేల్స్ ఊహించని రీతిలో ఉండడం వల్ల స్టార్టప్ కంపెనీ స్విచ్ మోటో కార్ప్ ఈ ఎలక్ట్రిక్ బైక్ ల తయారీ కోసం రూ.

100 కోట్ల పెట్టుబడి పెట్టినట్టు సమాచారం.ఈ ఎలక్ట్రిక్ బైక్ ను భారతదేశంలో ముందుగా హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై నగరాల షోరూంలో ద్వారా విక్రయాలు జరుపనున్నట్లు సమాచారం.

ఈ ఎలక్ట్రిక్ బైక్ కు సంబంధించిన ధరతో పాటు మిగతా ఫీచర్ వివరాలు త్వరలోనే కంపెనీ వెల్లడించనుంది.

ఈ రెస్టారెంట్‌ మెనూ ప్రపంచంలోనే ఖరీదైనది.. ధర చూస్తే ఫ్యూజులు ఔట్.. ఎక్కడుందంటే..?