కాలేజీ క్యాంటీన్‌లో చితక్కొట్టుకున్న అమ్మాయిలు.. చోద్యం చూసిన ఫ్రెండ్స్

సాధారణంగా ఎక్కడైనా ఇద్దరు కొట్టుకుంటుంటే చుట్టూ ఉన్న వాళ్లు విడదీస్తారు.అసలు గొడవ ఏంటని కనుక్కుని ఇద్దరికీ సర్ది చెబుతారు.

కానీ ఇటీవల పరిస్థితి మారుతోంది.తమ కళ్ల ముందే గొడవ జరుగుతున్నా చాలా మంది పట్టించుకోవడం లేదు.

కొందరైతే ఆ గొడవను చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు.బాగా కొట్టుకోవాలని ప్రోత్సహిస్తుంటారు.

పైపెచ్చు వారి గొడవను వీడియో తీస్తూ ఆనందిస్తున్నారు.అయితే దీని వల్ల గొడవలు చిలికి చిలికి గాలివానలా మారుతున్నాయి.

గొడవలు అంత పెద్దవిగా మారకుండా ఉండడానికి చుట్టు పక్కల ఎవరో ఒకరు జోక్యం చేసుకోవాలి.

దురదృష్టవశాత్తూ అలా జరగడం లేదు.తాజాగా ఓ కాలేజీలో అమ్మాయిలు కొట్టుకున్నారు.

దానిని చుట్టూ ఉన్న వాళ్లు వినోదం చూశారు.దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

బెంగళూరులో దయానంద సాగర్ అనే పేరుతో ఇంజినీరింగ్ కళాశాల ఉంది.తాజాగా ఆ కాలేజీ క్యాంటీన్‌లో ఇద్దరు అమ్మాయిలు చిన్న విషయానికే కొట్టుకున్నారు.

వెయిట్ మెషీన్‌పై బరువు చూసుకునే క్రమంలో వారిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి.మాట మాట అనుకుని, చివరికి కొట్టుకున్నారు.

ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.అయితే చుట్టూ చాలా మంది అమ్మాయిలు ఉన్నారు.

వారంతా వీరి గొడవను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.క్యాంటీన్‌లో అంత మంది ఫ్రెండ్స్ ఉన్నా, వారిని విడదీసేందుకు ఏ ఒక్కరూ రాలేదు.

"""/" / దీనిని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టగా విపరీతంగా వైరల్ అవుతోంది.

వారిద్దరు అంతగా గొడవ పడడానికి కారణం ఏంతో తెలుసుకుని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.వెయిట్ మెషీన్‌లో బరువు చూసుకునే క్రమంలో తలెత్తిన గొడవ చిలికి చిలికి గాలివానలా మారిందని తెలుసుకుని, అవాక్కవుతున్నారు.

వారు అలా కొట్టుకుంటున్నా చుట్టు పక్కల వాళ్లు పట్టించుకోకుండా చోద్యం చూడడాన్ని పలువురు తప్పు పడుతున్నారు.

అల్లు, మెగా ఫ్యామిలీలు కలిసిపోయినట్టేనా.. ఈ కుటుంబాల మధ్య గ్యాప్ తగ్గుతుందా?