ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక మలుపు

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది.

ఈ కేసులో అరెస్ట్ అయిన నిందితుడు వ్యాపారవేత్త దినేశ్ అరోరా అఫ్రూవర్ గా మారేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది.

ఈ క్రమంలో ప్రస్తుత ఢిల్లీ డిప్యూటీ సీఎంగా ఉన్న మనీశ్ సిసోడియాకు తాను సహాయకుడినని అరోరా న్యాయస్థానంలో ఒప్పుకున్నట్లు సమాచారం.

అయితే అఫ్రూవర్ గా మారేందుకు ఈనెల 14న రౌస్ అవెన్యూ కోర్టులో న్యాయమూర్తి ఎంకే నాగ్ పాల్ ముందు దినేశ్ అరోరా వాంగ్మూలం ఇచ్చారు.

ఈ నేపథ్యంలో అరోరాకు కోర్టు అనుమతినిచ్చింది.

భారతీయులపై అమెరికన్ విషం.. ‘H1B వైరస్’ అంటూ.. వీడియో చూస్తే రక్తం మరిగిపోతుంది!