మనిషిని పొట్టనపెట్టుకున్న మొసలి.. 2 గంటలపాటు ఆటాడుకుంది!

అది ముందే మొసలి.దాని బారిన పడి ప్రాణాలు కోల్పోయాడు ఓ వ్యక్తి.

అంతటితో ఆగలేదు మొసలి.ఇంకా ఉంది చూస్తూనే ఉండండి అన్నట్లుగా ప్రవర్తించింది ఆ మకరం.

దాని వింత ప్రవర్తన అక్కడి చుట్టు పక్కల గ్రామస్థులకు చాలా కొత్తగా అనిపించింది.

అంతే కాదండోయ్ ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

అసలు ఆ మొసలి ఎందుకలా ప్రవర్తించింది, ఏం చేసింది, దాని కథ ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

అది గుజరాత్ లోని వడోదరా ప్రాంతం.భారీగా కురిసిన వర్షాలతో నదులన్నీ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.

వడోదరా సమీపంలోని విశ్వా మిత్ర నదిలో కూడా నీరు ఎక్కువగా ప్రవహిస్తోంది.ఈ నదిలోని మొసలికి ఎలా చిక్కాడో తెలియదు గానీ, 30 ఏళ్ల వ్యక్తి దానికి చిక్కాడు.

ముందే మొసలి, అందులోని నది దాని సామ్రాజ్యం, నీటిలో దాని బలం రెట్టింపు అవుతుంది.

అయినా ఆ యువకుడు ప్రాణాలు కాపాడుకునేందుకు చాలా కష్టపడ్డాడు.కానీ దాని బలం ముందు ఆ యువకుడి బలం సరిపోలేదు.

అతడిని చంపేసింది.అంతటితో ఆగలేదు ఆ మకరం.

దాదాపు 2 గంటల పాటు అతడి మృతదేహంతో ఆటాడుకుంది.విషయం తెలుసుకున్న సమీప గ్రామ ప్రజలు.

ఘటనను చూసేందుకు పెద్ద ఎత్తున నది ఒడ్డుకు చేరుకున్నారు.వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.

మృతి చెందిన వ్యక్తి పాద్రా గ్రామానికి చెందిన ఇమ్రాన్ గా గుర్తించారు.

Wpt Global: Ein Klarer Guide Zu Kundensupport, Sicherheit Und Praxis Für Deutsche Spieler