కాలు కడుక్కోవడానికి వెళ్తే.. మొసలి కడుపులోకి.. ఇండోనేషియాలో భయానక ఘటన!

ఇండోనేషియాలోని( Indonesia ) సుమత్రాలో( Sumatra ) డిసెంబర్ 17న ఓ భయానక ఘటన చోటు చేసుకుంది.

నుర్హావతి( Nurhawati ) అనే 40 ఏళ్ల మహిళ సముద్రపు ఒడ్డున కాళ్లు కడుక్కుంటుండగా ఊహించని రీతిలో మొసలి దాడి( Crocodile Attack ) చేసింది.

ఆమె ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే మొసలి ఒక్కసారిగా నీళ్లలో నుంచి దూసుకొచ్చి ఆమెను లోపలికి లాక్కెళ్లిపోయింది.

ప్రత్యక్ష సాక్షి అగస్టినస్ 'ది మెట్రో'తో మాట్లాడుతూ ఆ క్షణాలను తలచుకుని వణికిపోయాడు.

"మొసలి ఆమెను నీటిలోకి లాగడం మా కళ్లముందే జరిగింది.మేము ఎంత కేకలు వేసినా అది ఆమెను వదలలేదు.

నీళ్లంతా రక్తం, ఆ దృశ్యం నరకాన్ని తలపించింది" అంటూ భయానక క్షణాలను వివరించాడు.

గంటసేపు ఉత్కంఠ తర్వాత, మొసలి నుర్హావతి నిర్జీవ దేహంతో మళ్లీ పైకి రావడంతో విషాదం అలుముకుంది.

స్థానికులు తెగువతో కోడి మాంసం ముక్కలను ఎరగా వేసి మొసలిని దారి మళ్లించి ఆమె మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చారు.

ఆ తర్వాత మొసలి నీటిలో కలిసిపోయింది.ఈ ఘటనతో ఆ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి.

"""/" / స్థానిక పోలీసులు, సహాయక బృందాలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నాయి.

మొసలి కోసం గాలించి చివరికి దాన్ని చంపేశారు.ఇలాంటి దాడులు మళ్లీ జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అధికారులు కోరుతున్నారు.

స్థానిక నాయకుడు కొర్నేలియస్ వావ్ మాట్లాడుతూ, స్థానికుల భద్రత గురించి ఆందోళన వ్యక్తం చేశారు.

ఆ ప్రాంతంలో 80% కంటే ఎక్కువ మంది ప్రజలు సముద్రంపైనే ఆధారపడి జీవిస్తున్నారని, తీర ప్రాంతంలోనే నివసిస్తారని ఆయన వివరించారు.

"""/" / చాలామంది తరచుగా సముద్రంలో స్నానం చేస్తూ, పనిచేస్తూ ఉంటారు.దీనివల్ల వాళ్ళు మొసళ్ల దాడులకు గురయ్యే ప్రమాదం ఉంది.

"ఈ సమస్యను పరిష్కరించకపోతే, ప్రజలు నిరంతరం భయంతో జీవించాల్సి వస్తుంది" అని ఆయన అన్నారు.

గత దశాబ్దంలో ఇండోనేషియాలో అత్యధిక మొసలి దాడులు నమోదయ్యాయి, 400 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.

సుమత్రా ప్రజలు తమ భద్రత కోసం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

2024 సంవత్సరంలో పెళ్లి పీటలెక్కిన తారలు వీళ్లే.. అన్యోన్యంగా ఉండాలంటూ?