ఇది మొసలా.. చిరుతనా.. అదేం ఉరకడమే తల్లి!

మనం ఎప్పుడైనా జూపార్క్ కు వెళ్తే.అక్కడ మొసళ్ల పార్క్ రాగానే మనం కాస్త భయం భయంగా చూస్తాం.

దూరంగా ఉంటూనే దాని వికృత రూపాన్ని చూసి భయపడతాం.అయితే కొన్ని మొసళ్లు నీటిలో ఈదుతూ ఉంటాయి.

మరికొన్ని ఒడ్డున నిద్రపోతూ ఉంటాయి.ఇంకొన్ని నోరు తెరిచి చూస్తుంటాయి.

మెల్లి మెల్లిగా నడుస్తూ.కనిపిస్తాయి.

పాకినట్లుగానే అనిపిస్తుంటుంది చాలా సార్లు.కానీ మనం ఇప్పుడు చూడబోయే వీడియోలో మాత్రం ఓ మొసలి రెండు కాళ్లను ఒకేసారి కదిపి.

తర్వాత వెనుక రెండు కాళ్లతో జంప్ చేసింది.ఇలా చిరుత పులులు, సింహాలు వంటివి మాత్రమే పరిగెడుతుంటాయి.

కానీ ఇక్కడ నేలపై పాకే లాంటి మొసలి ఇలా చేయడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

ఇందుకు సంబంధించిన వీడియోని ట్విట్టర్ లో తన అకౌంట్ @susanntananda3లో పోస్టు చేశారు ఐపీఎస్ సుషాంత నంద.

మొసలి పరిగెత్తడం నేనెప్పుడూ చూడలేదని క్యాప్షన్ కూడా ఇచ్చారు.ఈ వీడియోని ఆగల్టు 23న తేదీన పోస్టు చేయగా.

24 వరకు 79 వేల మందికి పైగా చూశారు.2 వేల 420 మంది లైక్ చేయగా.

వందల మంది కామెంట్లు చేశారు.అయితే పార్కులో ఉన్న ఈ మొసలి ఓ వ్యక్తిని తరుముతోంది.

ఈ క్రమంలోనే అది చిరుతలా పరుగులు పెట్టింది.దాంతో ఈ వ్యక్తి అక్కడ నుంచి పారిపోయాడు.

ఇదంతా కొంత మంది ఎన్ క్లోజర్ నుంచి చూస్తున్నారు.మీరూ ఓ సారి ఈ వీడియో చూసేయండి.

‘నో ఫ్లై ’ లిస్టులో పేరు .. భారత సంతతి సిక్కు కార్యకర్తలకు కెనడా కోర్టులో చుక్కెదురు