గోల్ఫ్ కోర్టు లోకి ప్రవేశించిన మొసలి... సోషల్ మీడియా లో వైరల్

గోల్ఫ్ కోర్టు లోకి ఒక అనుకోని అతిధి వచ్చింది.కానీ ఆ అతిధి ఎవరో తెలిస్తే మాత్రం మీ గుండె జల్లు మనక మానదు.

ఇంతకీ ఆ అతిధి ఎవరంటే మొసలి.నిజంగానే దక్షిణ ఫ్లోరిడా లోని బోణీత నేషనల్ గోల్ఫ్ అండ్ కంట్రీ క్లబ్ గ్రౌండ్స్ లో అనుకోని అతిధి గా మొసలి వచ్చిన ఈ ఘటన చోటుచేసుకుంది.

అసలు నిజానికి మొసలిని మనం దూరం నుంచి చూస్తేనే భయంతో గుండెలు జారిపోతాయి.

అలాంటి మొసలి గోల్ఫ్ కోర్టు లోకి అనుకోని అతిధిగా ప్రవేశించడం తో అక్కడ జనాలు అందరూ ఆశ్చర్యం తో పాటు భయభ్రాంతులకు గురయ్యారు.

"""/"/ ఈ ఘటన ఏప్రిల్ 30 వ తేదీన చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

అలా గ్రౌండ్ లోకి అడుగుపెట్టిన మొసలి కి సంబందించిన దృశ్యాలను పక్కనే ఉన్న లోరి అనే మహిళ తన కెమెరాలో రికార్డ్ చేసింది.

అయితే మూడు కాళ్లే ఉన్న ఆ మొసలి కొద్దీ దూరం వెళ్లిన తరువాత కుప్పకూలిన ఘటన ఆ దృశ్యాల్లో స్పష్టంగా కనిపిస్తుంది.

అయితే గత నెల 30 న చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబందించి వీడియో ను ఆ మహిళ సోషల్ మీడియా లో పోస్ట్ చేయడం తో ఇప్పుడు ఆ వీడియో వైరల్ గా మారింది.

రిస్క్ తీసుకోవడానికి సిద్ధమైన జగన్.. వైసీపీ మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలివే!