ప్రశాంత్ వర్మ వైఖరి ఏంటో అర్థం కావడం లేదంటున్న విమర్శకులు… అసలేం జరిగింది..?
TeluguStop.com
తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్న డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.
( Director Prashanth Varma ) ప్రస్తుతం ఆయన చేస్తున్న 'జై హనుమాన్'( Jai Hanuman ) సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.
ఇక అందులో భాగంగానే రిషబ్ శెట్టి ని( Rishab Shetty ) హనుమంతుడిగా తీసుకున్న విషయాన్ని దీపావళి కానుకగా ఒక పోస్టర్ రూపంలో రిలీజ్ చేసి అందరికీ తెలియజేశారు.
మరి మొత్తానికైతే రిషబ్ శెట్టి ఈ సినిమాలో హనుమంతుడు పాత్రను పోషించడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి.
ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ తెలుగులో ఉన్న ట్రేడ్ పండితులు మాత్రం హనుమంతుడి క్యారెక్టర్ కోసం రిషబ్ శెట్టి ని తీసుకోవాల్సిన అవసరం ఏముంది.
"""/" /
తెలుగులో చాలామంది పాన్ ఇండియా ఆర్టిస్టులు ఉన్నారు కదా వాళ్ళని తీసుకుంటే సరిపోయేది కదా అని ప్రశాంత్ వర్మ మీద కొన్ని విమర్శలైతే చేస్తున్నారు.
నిజానికి ప్రశాంత్ వర్మ రాసుకున్న క్యారెక్టర్ కి రిషబ్ శెట్టి చాలా బాగా యూజ్ అవుతాడు.
కానీ కొందరు కావాలనే ప్రశాంత్ వర్మ మీద నెగటివ్ కామెంట్లు చేస్తున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.
ఇక రీసెంట్ గా రిలీజ్ చేసిన రిషబ్ శెట్టి ఫస్ట్ లుక్ పోస్టర్ అద్భుతంగా ఉంది.
ప్రేక్షకులు అందరూ హనుమంతుడి థీమ్ సాంగ్ వింటూ పోస్టర్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.
"""/" /
మరి ఏది ఏమైనా కూడా జై హనుమాన్ సినిమాతో మరోసారి ప్రశాంత్ వర్మ పెను ప్రభంజనాన్ని సృష్టించడానికి రెడీ అవుతున్నాడనే విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది.
ఇక ఇప్పటికైనా ప్రశాంత్ వర్మ పేరు పాన్ ఇండియాలో మారుమ్రోగబోతుంది అంటూ కొందరు ఆయన గురించి చాలా గొప్పగా చెబుతున్నారు.
ఇక ఏది ఏమైనా కూడా పాన్ ఇండియా లెవెల్లో రీసెంట్ గా వస్తున్న చాలా సినిమాలు మంచి విజయాలను సాధిస్తున్నాయి.
ఇక దానికి తగ్గట్టుగానే జై హనుమాన్ సినిమా కూడా భారీ రీచ్ ను అందుకుంటుందంటూ మేకర్స్ భారీ నమ్మకాన్ని పెట్టుకున్నారు.
బీహార్ ఫెయిల్డ్ స్టేట్ .. ఎన్ఆర్ఐలతో ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు