మూసి పేరుతో దోపిడీ .. కాంగ్రెస్ కేంద్ర మంత్రి విమర్శలు

తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్ ( Congress )పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్.

ముఖ్యంగా మూసి ప్రక్షాళన పేరుతో కాంగ్రెస్ భారీ ఎత్తున అవినీతికి ప్లాన్ చేసిందని సంజయ్ విమర్శించారు.

సంక్షేమ పథకాలను అమలు చేయలేక ఎన్నికల హామీల అమలు చేతగాక , కాంగ్రెస్ ప్రభుత్వం చేతులు ఎత్తేసిందని ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్ దోపిడీకి,  పేదల ఇల్లు కూల్చివేతకు బిజెపి వ్యతిరేకమని పర్కొన్నారు .కాంగ్రెస్ తీరును నిరసిస్తూ మూసి బాధితుల పక్షాన రేపు శుక్రవారం ఇందిరా పార్క్( Indira Park ) వద్ద బిజెపి చేపట్టబోయే మహాధర్నాను విజయవంతం చేయాలని సంజయ్ కోరారు .

"""/" / మూసి బాధితులు,  ప్రజలు పెద్ద ఎత్తున మహా ధర్నా కార్యక్రమంలో పాల్గొనాలని సంజయ్( Sanjay ) కోరారు .

మూసి పునర్జీవం పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇళ్లు కూల్చివేయడాన్ని బిజెపి తరఫున తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, మూసి పేరుతో కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తున అవినీతికి తెరతీసిందని , కాలేశ్వరం పేరుతో ( Kaleshwaram )బిఆర్ఎస్ పార్టీ లక్ష కోట్లు ఖర్చు చేసి ఏటీఎం లో వాడుకుందని , లక్షన్నర కోట్లు అప్పు చేసి ఏటీఎంలా గా మార్చాలి అనుకుంటున్నారు.

"""/" / రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది .గత పాలకులు చేసిన దాదాపు ఆరు లక్షల కోట్ల పైచిలుకు అప్పులకు 10 నెలల్లోనే 60 వేల వడ్డీల రూపంలో చెల్లిస్తున్నారని,  ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం గగనమైందని,  సంక్షేమ పథకాలను అమలు చేయలేక ఎన్నికల హామీలు అమలు చేతకాక కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేసింది.

  మూసి ప్రక్షాళన పేరుతో గత మూడు దశాబ్దాలుగా జైక , జపాన్ నిధులు కూడా ఖర్చు చేసినా ఒరిగిందేమీ లేదని విమర్శించారు.

  పాలకులు చేస్తున్న అప్పుల భారం అంతా వివిధ రకాల పన్నుల రూపంలో ప్రజలపై భారం పడుతోందని,  తెలంగాణలో 92% కుటుంబాలు అప్పుల్లో ఉన్నాయని,  రాష్ట్రంలో ఒక్కో కుటుంబం పై సగటున 1,29,599 అప్పు ఉందని , మూసి పేరుతో లక్షన్నర కోట్ల అప్పు చేసి ప్రజలపై భారం వేయాలని చూస్తున్నారని సంజయ్ విమర్శించారు.

తేజ ఏం సినిమా చేస్తున్నాడు…రానా మూవీ ఆగిపోయిందా..?