అయ్యో పాపం : మళ్లీ లోకేష్ టార్గెట్ అయ్యాడుగా ? 

ఏదో ఒక విషయంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి చంద్రబాబు తనయుడు నారా లోకేష్ విమర్శల పాలు అవుతూనే ఉంటారు.

ఆయన ఎంతగా తన ప్రతిభను చాటి చెప్పేందుకు ప్రయత్నించినా,  సొంత పార్టీలోనే ఆయనకు అసమ్మతి అన్నట్లుగా వ్యవహారం ఉంది.

తన వేషభాషలను పూర్తిగా మార్చుకుని , సంపూర్ణ రాజకీయ నాయకుడిగా అవతరించేందుకు లోకేష్ ప్రయత్నించి అనుకున్న మేర సక్సెస్ అయ్యారు.

వైసీపీ ప్రభుత్వం పై అదేపనిగా సోషల్ మీడియా ద్వారా విమర్శలు చేస్తూ టిడిపి గ్రాఫ్ పెంచే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు.

పార్టీలోనూ తన ప్రభావం చూపించేందుకు ప్రయత్నిస్తూ,  సొంత వర్గాన్ని ఏర్పాటు చేసుకుని, వారికి కీలక పదవులు దక్కే విధంగా చేస్తున్నారు.

అయినా మెజార్టీ  నాయకులు ఆయన నాయకత్వాన్ని ఆమోదించేందుకు ఇంకా సందిగ్ధం లోనే లోనే ఉన్నారు.

లోకేష్ చేతిలో పార్టీ పెడితే తెలుగుదేశం పార్టీ పూర్తిగా దెబ్బ తింటుంది అనే అభిప్రాయాన్ని పార్టీ సీనియర్లు అనేక సందర్భాల్లో వ్యక్తం చేశారు.

ఇది ఇలా ఉంటే, ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ కార్యాలయం పై వైసీపీ శ్రేణుల దాడుల వ్యవహారం వైరల్ గా మారింది.

ఈ విషయాన్ని హైలెట్ చేసుకుని రాజకీయంగా లబ్ధి పొందేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు ఈ క్రమంలోనే ఆయన 36గంటల దీక్షకు దిగారు.

అయితే ఈ వయసులో చంద్రబాబు దీక్షకు దిగడం పై  మళ్లీ సొంత పార్టీ నేతలకు లోకేష్ టార్గెట్ అయ్యారు.

అసలు టిడిపి కార్యాలయం పై వైసీపీ కార్యకర్తలు దాడి చేసిన సమయంలో లోకేష్ ఏపీ లో లేరు హైదరాబాదులో ఉన్నారు.

  """/"/ ఆయన ఎక్కువగా హైదరాబాద్ కే పరిమితం అవుతున్నారు తప్ప, ఏపీ రాజకీయాల్లో ప్రత్యక్షంగా పాల్గొంటూ పార్టీపై పట్టు పెంచుకునేందుకు ప్రయత్నం చేయడం లేదు.

కేవలం సోషల్ మీడియా ద్వారా మాత్రమే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ యాక్టివ్ గా ఉన్నట్టుగా వ్యవహరిస్తున్నారు.

దీంతో పార్టీ నాయకులకు కార్యకర్తలకు లోకేష్ అందుబాటులో ఉండటం లేదనే ఫిర్యాదులు చంద్రబాబుకు తరచుగా వస్తూనే ఉన్నాయి.

గతంలో లోకేష్ యాక్టివ్ గా  ఉన్నంతగా ఇప్పుడు ఉండకపోవడానికి కారణం చంద్రబాబు అని , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు దగ్గరయ్యేందుకు లోకేష్ సైలెంట్ అయ్యేలా చేశారని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

ఈ వ్యవహారంపై లోకేష్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని,  రాజకీయంగా ఎదిగేందుకు సరైన సమయం ఇదే అయినా, జనసేన తో పొత్తు కోసం తనను సైలెంట్ అయ్యేలా చేయడం పై బాబు పై కాస్త అసంతృప్తితో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది.

లోకేష్ యాక్టివ్ కాకుండా చంద్రబాబు రాజకీయ వ్యూహం పన్నినా,  పార్టీ కార్యకర్తలలోనూ, జనాలలోనూ మాత్రం లోకేష్ సైలెంట్ అవడం పై మాత్రం విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

వేసవిలో నీరసం ఉక్కిరిబిక్కిరి చేస్తుందా.. ఈ ఒక్కటి తీసుకుంటే క్షణాల్లో రిలీఫ్ పొందవచ్చు!