కేసీఆర్ పేరెత్తకుండా అవినీతి విమర్శలు ! ప్రధాని చాకచక్యం 

భారత ప్రధాని నరేంద్ర మోది( Narendra Modi ) తెలంగాణలో అడుగు పెట్టారు.

సికింద్రాబాద్ తిరుపతి వందే భారత్ ఎక్స్ ప్రెస్( Vande Bharat Express )  రైలును ప్రారంభించి  అనేక అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.

ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోది వ్యూహాత్మకంగా వ్యవహరించారు.

ముఖ్యంగా బీఆర్ఎస్ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్ ( CM KCR )ను టార్గెట్ చేసుకుంటూ ప్రధాని విమర్శలు చేశారు.

అయితే ఎక్కడా  కేసిఆర్ పేరు ప్రస్తావించకుండా, పరోక్ష విమర్శలు చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణ అభివృద్ధి చెందకపోవడానికి కేసీఆర్ కారణమనే విధంగా ప్రధాని వ్యాఖ్యానించారు.రాష్ట్ర ప్రభుత్వం సరైన సహకారం అందించకపోవడం వల్లే అభివృద్ధి కార్యక్రమాలు ఆలస్యం అవుతున్నాయని, రాజకీయాలను పక్కనపెట్టి అభివృద్ధి కార్యక్రమాలకు విఘతం కలగకుండా చూడాలంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రధాని కోరారు.

"""/" / మీ అభివృద్ధి పనులు చూస్తుంటే సొంత పనుల కోసం,  కుటుంబ సభ్యుల లాభం కోసం కొంతమంది ప్రయత్నిస్తున్నారు అంటూ కేసిఆర్ కుటుంబాన్ని ఉద్దేశించి ప్రధాని విమర్శించారు.

ఏ విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో కలిసి రావడం లేదని,  స్వార్థ ప్రయోజనాల కోసమే ఎక్కువగా ప్రయత్నిస్తున్నారంటూ విమర్శించారు.

అవినీతి,  కుటుంబ పాలన రెండు ఒకటేనని,  తెలంగాణ( Telangana ) కొందరి గుప్పట్లోనే అధికారం మగ్గుతోందని , కుటుంబ పాలనతో అవినీతి పెరిగిందని,  ప్రతి వ్యవస్థలో  పెత్తనం చేసేందుకు వారు ప్రయత్నిస్తున్నారంటూ కెసిఆర్ ను ఉద్దేశించి ప్రధాని వ్యాఖ్యానించారు.

అవినీతిపరులకు వ్యతిరేకంగా పోరాడవలసిందేనని,  అవినీతిని ముక్తకంఠంతో ఖండించాలని,  ఎంత పెద్ద వారైనా చట్టపరంగా చర్యలు  తీసుకోల్సిందేనని ప్రధాని అన్నారు.

"""/" / చట్టపరమైన సంస్థల పనిని అడ్డుకోవద్దని , విచారణ సంస్థలను బెదిరిస్తున్నారని , కొంతమంది అవినీతిపరులు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారని,  కానీ కోర్టు వారికి తగిన గుణపాఠం చెప్పిందని,  కుటుంబ పాలన నుంచి తెలంగాణ కు విముక్తి కావాలని,  నాపై పోరాటం చేసేందుకు అన్ని శక్తులు ఏకం అయ్యియి అంటూ ప్రధాని విమర్శలు చేశారు.

ప్రధాని ప్రసంగం మొదటి నుంచి చివరి వరకు ఎక్కడా కెసిఆర్ , ఆయన కుటుంబ సభ్యులు పేర్లు ప్రస్తావించకుండా పరోక్షంగా వారినే టార్గెట్ చేసుకుని విమర్శలు చేశారు.

సమంత కొండా సురేఖ ఇష్యూ.. స్పందించని ఏపీ డిప్యూటీ సీఎం పవన్?