ఓటమి భయంతోనే విమర్శలు: మంత్రి హరీష్ రావు

మునుగోడు ఉపఎన్నిక ప్రజల ఆత్మగౌరవ పరీక్ష అని మంత్రి హరీష్ రావు అన్నారు.

గత ఎనిమిదేళ్లలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఏం అభివృద్ధి పనులు చేసిందో ప్రజలకు తెలుసన్న ఆయన.

ప్రజలే తీర్పునిస్తారని చెప్పారు.మునుగోడులో రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి గెలుస్తుందా.

? లేక రాజగోపాల్ రెడ్డి ధనం గెలుస్తుందా అన్నది చూడాలన్నారు.ఎనిమిదేళ్లలో బిజెపి ప్రభుత్వం చేసిందేమీ లేదని విమర్శించారు.

ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం అమ్ముతుందని, ఒక్క ఉద్యోగాన్ని కూడా భర్తీ చేయడం లేదని ఆరోపించారు.

బిజెపి చేసిన ఒక మంచి పనైనా ఉందా అని ప్రశ్నించారు.మునుగోడులో ఓడిపోతామన్న భయంతోనే బండి సంజయ్ తాంత్రిక పూజలని మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.

బీజేపీకి తెలిసినన్న తాంత్రిక విద్యలు ఎవరికీ తెలియదని మంత్రి హరీష్ రావు విమర్శించారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో నందమూరి బాలకృష్ణ పోటీ చేశారా.. ఎన్ని ఓట్లు పడ్డాయంటే?