గేమ్ ఛేంజర్ బోరింగ్…. టైం వేస్ట్ సినిమా…. ఉమైర్ సంధు షాకింగ్ రివ్యూ?
TeluguStop.com
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్( Ramcharan ) నటించిన గేమ్ ఛేంజర్( Game Changer ) సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10వ తేదీ ప్రేక్షకుల ముందుకు పాన్ ఇండియా స్థాయిలో విడుదల కావడానికి సిద్ధంగా ఉంది.
శంకర్( Shankar ) డైరెక్షన్లో తెరకెక్కిన సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ స్థాయిలోనే అంచనాలు ఉన్నాయి.
ఇక ఈ సినిమా నుంచి ఇప్పటివరకు విడుదల చేసిన అప్డేట్స్ కనుక చూస్తే సినిమా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయబోతుందని స్పష్టం అవుతుంది.
ఇలా ఈ సినిమాకు ఇప్పటికే పాజిటివ్ వైబ్స్ ఉన్న నేపథ్యంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు, క్రిటిక్ ఉమైర్ సందు( Umair Sandhu ) ఈ సినిమా రివ్యూ తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా షాకింగ్ పోస్ట్ చేశారు.
"""/" /
ఈ సందర్భంగా గేమ్ ఛేంజర్ సినిమా గురించి ఈయన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.
సినిమా అసలు బాలేదని ఇదొక టైం వేస్ట్ సినిమా అని ఒక్క మాటలో సినిమాపై నెగిటివ్ రివ్యూ ఇస్తూ సంచలనం సృష్టించారు.
రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్లో రాబోతున్న గేమ్ ఛేంజర్ చిత్రం అత్యంత బలహీనమైన సినిమా అంటూ చెప్పుకు వచ్చారు.
బోరింగ్ నరేషన్, కాలం చెల్లిన కథ, స్క్రీన్ ప్లే డైలాగ్స్ అన్ని కూడా పేలవంగానే ఉన్నాయని ఈ బాలీవుడ్ క్రిటిక్ తెలిపాడు.
"""/" /
నటీనటుల ప్రదర్శన కూడా అంతగా లేదని తెలిపారు.ఈ విషయంలో రామ్ చరణ్ నన్ను క్షమించాలని అతను కోరాడు.
ఒక్క మాటలో ఈ సినిమా గురించి చెప్పాలి అంటే ఇదొక టార్చర్ అంటూ ఈయన ఈ సినిమా గురించి చేసిన ట్వీట్ ప్రస్తుతం సంచలనంగా మారింది.
ఇక ఈయన చేసిన ఈ పోస్ట్ పై మెగా అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
సినిమా విడుదల కాకుండా ఇలాంటి నెగటివ్ ప్రచారాలు చేసే వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు.
అమెరికాలో అక్రమ నివాసం .. 18000 వేల మంది భారతీయుల బహిష్కరణకు ఏర్పాట్లు