తెలంగాణ కాంగ్రెస్‎లో సంక్షోభం.. చక్కదిద్దే ప్రయత్నాల్లో అధిష్టానం

తెలంగాణ కాంగ్రెస్ లో సంక్షోభం క్రమక్రమంగా ముదురుతోంది.దీంతో రంగంలోకి దిగిన పార్టీ అధిష్టానం చక్కదిద్దే ప్రయత్నాలు ప్రారంభించింది.

ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితులను రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్లనున్నారు.ఈ మేరకు రాహుల్ గాంధీని కలిసి రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులను మాణిక్కం ఠాగూర్ వివరించనున్నారు.

ఇప్పటికే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను మాణిక్కం ఠాగూర్ కలిశారు.అర్ధరాత్రి 12.

30 గంటల వరకు సాగిన భేటీలో తెలంగాణ కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలపై సుదీర్ఘంగా చర్చించారు.

ఖర్గే సూచనతో ఇవాళ రాహుల్ గాంధీని కలవనున్నారు.పార్లమెంట్ సమావేశాలు ముగియగానే టీ.

కాంగ్రెస్ నేతలతో సమావేశానికి ఏఐసీసీ సమాయత్తం అవుతుంది.

ఆ పదిమంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తారా ? ఉప ఎన్నికలు ఖాయమేనా ?