రాజస్థాన్ కాంగ్రెస్‎లో సంక్షోభం

రాజస్థాన్ కాంగ్రెస్‎లో సంక్షోభం చెలరేగింది.రాష్ట్రానికి కొత్త సీఎం ఎంపిక విషయంలో పొలిటికల్ హైడ్రామా కొనసాగుతోంది.

దీంతో సీఎంగా ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది.

గెహ్లాటే సీఎంగా కొనసాగాలని ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు.లేని పక్షంలో రాజీనామాలు చేస్తామంటూ అసెంబ్లీ స్పీకర్ సీపీ జోషి నివాసానికి వెళ్లిన 90 మంది ఎమ్మెల్యేలు రాజీనామా లేఖలు సమర్పించినట్లు సమాచారం.

ఈ క్రమంలో తన చేతిలో ఏం లేదంటూ గెహ్లాట్ అధిష్టానానికి తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది.