నేర విచారణ మరింత సమర్ధవంతంగా ఉండాలి – జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్
TeluguStop.com
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ సబ్ డివిజన్ పోలీస్ అధికారులతో శుక్రవారం రోజున జిల్లా పోలీస్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్ నందు నేర సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.నేర విచారణ మరింత సమర్ధవంతంగా చేయడంతో పాటు కేసులను సత్వరం పరిష్కరించే విధంగా పోలీస్ అధికారులంతా సమర్ధవంతంగా పని చేయాలని,పెండింగ్ కేసులను త్వరితంగా పరిష్కరిస్తూ పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించడానికి చర్యలు తీసుకోవాలన్నారు.
పోలీస్ శాఖ వినియోగిస్తున్నా సాంకేతికతను పూర్తి స్థాయిలో వినియోగించుకుంటూ నేరాలపై నిఘా పెంచాల్సిన అవసరం ఉన్నదన్నారు.
రౌడీ షీటర్స్,హిస్టరీ షీటర్స్ లపై నిరంతర పర్యవేక్షణ.వివిధ నేరాల్లో నిందుతులుగా ఉండి షీట్లు తెరువబడి వారు విధిగా పోలీస్ స్టేషన్ కి హాజరు కావాలని లేని పక్షంలో బైండోవర్ చేయాలన్నారు.
పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న రౌడీషీటర్ల,హిస్టరీ షీటర్స్ ల కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచాలని,శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ సామాన్య ప్రజానీకానికి ఇబ్బందులు కలిగించే వారిపై కొత్తగా రౌడీషీట్స్ తెరవాలని ఆదేశించారు.
చట్ట వ్యతిరేక కార్యకలాపాలు,అక్రమ వ్యాపారాలపై నిఘా ఉంచాలి.జిల్లాల, రాష్ట్ర సరిహద్దుల నుండి వచ్చే గంజాయి సరఫరా చేసే మూలాలను,కీలక వ్యక్తులను గుర్తించి వారిపై కేసులు నమోదు చేసి అక్రమ గంజాయి రవాణా పకడ్బందీగా నియంత్రించాలన్నారు.
అక్రమ కార్యకలాపాలు అయిన పేకాట,గుడుంబా,PDS రైస్,వాటి పై నిఘా ఉంచి దాడులు నిర్వహించి అరెస్ట్ చేయాలని సూచించారు.
ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రతి రోజూ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లు, వాహన తనిఖీలు నిర్వహించాలని డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పట్టుబడిన వ్యక్తుల యొక్క డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొని ఆ యొక్క లైసెన్స్ రద్దుకు సంబంధిత రవాణా శాఖ అధికారులకు సిఫారసు చేయాలని అన్నారు.
బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించే ప్రాంతాలపై నిఘా ఉంచి వారిపై కేస్లు నమోదు చేయాలని అన్నారు.
ఈ సమావేశంలో ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి, అదనపు ఎస్పీ చంద్రయ్య, సి.ఐ లు వీరప్రసాద్, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, మధుకర్, ఎస్.
ఐ లు ,ఐటీ కోర్ సిబ్బంది పాల్గొన్నారు.
వంటింట్లో ఉండే బంగాళదుంపతో ఎన్ని చర్మ సమస్యలను దూరం చేసుకోవచ్చో తెలుసా..?