దేశంలో 45% ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు…ఏడీఆర్ రిపోర్టు…!

దేశంలో 45% ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు…ఏడీఆర్ రిపోర్టు…!

నల్లగొండ జిల్లా:దేశంలోని28 రాష్ట్రాలు,3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో 4,092 మంది ఎమ్మెల్యేలలో 45 శాతం1,861 మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు ఉన్నాయని అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్) నివేదిక విడుదల చేసింది.

దేశంలో 45% ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు…ఏడీఆర్ రిపోర్టు…!

నేతలు ఇటీవల ఎన్నికలకు సమర్పించిన అఫిడవిట్లను విశ్లేషించి ఏడీఆర్ ఈ రిపోర్ట్ రూపొందించింది.

దేశంలో 45% ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు…ఏడీఆర్ రిపోర్టు…!

మొత్తం 4123 మంది ఎమ్మెల్యేలు కాగా,24 మంది ఎమ్మెల్యేల అఫిడవిట్లు సరిగ్గా స్కాన్ చేయని కారణంగా వాటిని విశ్లేషించలేదని తెలిపింది.

45 శాతం ఎమ్మెల్యేలు తమపై క్రిమినల్‌ కేసులు ఉన్నాయని ఎన్నికల అఫిడవిట్లలో వెల్లడించారు.

ఇందులో 29 శాతం ఎమ్మెల్యేలు అంటే 1,205 మందిపై హత్య, హత్యాయత్నం,అపహరణ, మహిళలపై నేరాలు లాంటి తీవ్ర అభియోగాలు ఉన్నాయి.

127 మంది ఎమ్మెల్యేలపై మహిళలపై నేరాలకు పాల్పడ్డ కేసులు, అందులో 13 మంది నేతలపై అత్యాచారం కేసులున్నాయి.

ఇదిలా ఉంటే 1,861 మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులుండగా,ఏపీ 175 ఎమ్మెల్యేల్లో ఏకంగా 138 (79 శాతం)మంది ఎమ్మెల్యేలు క్రిమినల్‌ అభియోగాలు ఎదుర్కొంటూ అగ్ర స్థానంలో నిలిచింది.

తీవ్ర నేరాభియోగాలు ఉన్న శాసనసభ్యుల్లోనూ ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలే తొలి స్థానంలో ఉన్నారు.56% ఎమ్మెల్యేలు అంటే 98 మంది నేతలపై తీవ్ర నేరాభియోగాలు నమోదయ్యాయి.

ఆ తర్వాతి స్థానాల్లో కేరళ 69%,తెలంగాణ 69%, బీహార్‌ లో 66%, మహారాష్ట్ర 65%,తమిళనాడు 59% ఎమ్మెల్యేలపై క్రిమినల్ అభియోగాలు ఉన్నాయి.

తెలంగాణలోని 50% ఎమ్మెల్యేలపై,బీహార్‌ లోని 49% ఎమ్మెల్యేలు,ఒడిశాలోని 45% ఎమ్మెల్యేలు,ఝార్ఖండ్‌ లోని 45% ఎమ్మెల్యేలపై తీవ్ర నేరాభియోగాలు ఉన్నాయి.

బీజేపీకి 1653 ఎమ్మెల్యేలలో 638 (39%) మందిపై క్రిమినల్ కేసులున్నాయి.వీరిలో 436 మంది (29%) ఎమ్మెల్యేలపై తీవ్ర నేరాభియోగాలు ఉన్నాయి.

కాంగ్రెస్ పార్టీకి చెందిన 646 ఎమ్మెల్యేలలో 339 (52%) మందిపై క్రిమినల్ కేసులున్నాయి.

వీరిలో 194 (30%) మంది ఎమ్మెల్యేలపై తీవ్ర నేరాభియోగాలున్నాయి.టీడీపీకి చెందిన 134 మంది ఎమ్మెల్యేలలో 115 మందిపై క్రిమినల్ కేసులున్నాయి.

82 మంది ఎమ్మెల్యేలపై తీవ్ర నేరాభియోగాలు నమోదయ్యాయి.తమిళనాడుకు చెందిన డీఎంకే పార్టీ 132 మంది ఎమ్మెల్యేలలో 98 (74%) మంది నేతలపై క్రిమినల్ కేసులున్నాయి.

వీరిలో 42 మందిపై తీవ్ర నేరాభియోగాలు ఉన్నాయి.పశ్చిమ బెంగాల్ కు చెందిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ 230 మంది ఎమ్మెల్యేలలో 95 (41%) మంది నేతలపై క్రిమినల్ కేసులున్నాయి.

వీరిలో 78 మందిపై తీవ్ర నేరాభియోగాలు ఉన్నాయి.ఆమ్ ఆద్మీ పార్టీ (ఏఏపి)కి చెందిన 123 మంది ఎమ్మెల్యేలలో 69 (56%) మంది నేతలపై క్రిమినల్ కేసులున్నాయి.

వీరిలో 35 మందిపై తీవ్ర నేరాభియోగాలు ఉన్నాయి.నేతలు ఎన్నికల అఫిడవిట్‌లో వెల్లడించిన డేటా ఆధారంగా ఏడీఆర్ ఈ రిపోర్ట్ విడుదల చేసింది.

లైట్లు వెలిగించొద్దని చెప్పి మరీ చనిపోయాడు.. కారణం తెలిస్తే గుండె తరుక్కుపోతుంది..