‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే 2’ను పైరసీ చేసే వారిపై క్రిమినల్ చర్యలు

100 శాతం తెలుగు ఎంట‌ర్‌టైన్మెంట్ ఫ్లాట్ ఫామ్ ‘ఆహా’.ఈ ఫ్లాట్ ఫామ్‌లో ‘అన్‌స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే2’ ప్రోగ్రామ్‌ను లాంచ్ చేయ‌టానికి స‌ర్వం సిద్ధ‌మైంది.

శుక్ర‌వారం (అక్టోబ‌ర్ 14) మ‌ధ్యాహ్నం 2 గంట‌ల 13 నిమిషాల‌కు ఈ షోను నంద‌మూరి బాల‌కృష్ణ హోస్ట్ చేయ‌బోతున్నారు.

సీజ‌న్ 1ను హోస్ట్ చేసిన ఆయ‌న కొన్ని ల‌క్ష‌ల మంది తెలుగు ప్రేక్ష‌కుల హృద‌యాల‌ను సొంతం చేసుకోవ‌ట‌మే కాకుండా.

ఐఎండీబీ ర్యాంకింగ్‌లో నెంబ‌ర్ 1గా నిలిచింది.టాప్ టెన్ టాక్ షోస్‌లో నెంబ‌ర్ 1 స్థానాన్ని ఆక్ర‌మించింది.

సీజ‌న్ 1 చాలా మంది జీవితాల‌ను మార్చింది.నంద‌మూరి బాల‌కృష్ణ‌తో పాటు ప్రోగ్రామ్‌లో పార్టిసిపేట్ చేసిన గెస్టులు ఎంతో మందికి త‌మ వంతు సాయాన్ని అందించ‌టంతో పాటు జీవితంపై వారి దృక్ప‌థాన్ని మార్చేశారు.

ఇలాంటి ప్రోగ్రామ్‌ను మ‌రింత మందికి చేరువ చేయ‌టం కోసం ఆహా మ‌రో అడుగు ముందుకేసింది.

నంద‌మూరి హార్డ్ కోర్ ఫ్యాన్స్ స‌హా అంద‌రూ ‘సే నో టు పైరసీ’ అని ముందుకు రావాలని కోరింది.

అన్‌స్టాప‌బుల్ సీజ‌న్ 1 అక్ర‌మంగా ప‌లు వెబ్ సైట్స్‌లో అందుబాటులో ఉంది.ఇలాంటి అక్ర‌మాల‌కు చెక్ పెడుతూ పోరాటం చేయ‌టానికి ఆహా అడుగులు వేస్తుంది.

‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే 2’ను ఎవరైనా పైరసీ చేసినట్లు గమనించినట్లయితే వెంటనే పైర‌సీకి సంబంధించిన ఫొటోల‌ను, వీడియోల‌ను జ‌త చేస్తూ యాంటీ పైరసీ హెల్ప్ లైన్ నెంబర్ 93939 50505 లేదా Apc50505@gmail!--com ల‌కు వివ‌రాల‌ను తెలియజేయాలని కోరారు.

అలాంటి వ్య‌క్తులు లేదా సంస్థ‌ల‌పై ఆహావారు చ‌ట్ట ప‌ర‌మైన సివిల్‌, క్రిమిన‌ల్ చ‌ర్య‌ల‌ను తీసుకుంటారు.

అన్‌స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే 2 యాంటీ పైర‌సీ గురించి ఆహా సీఈఒ అజిత్ ఠాకూర్ మాట్లాడుతూ ఈ ప్రోగ్రామ్‌లో 500 కంటే ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేశారు.

వారంద‌రి త‌ర‌పున మేం మిమ్మ‌ల్ని వేడుకునేదొక‌టే సే నో టు పైర‌సీ (పైర‌సీ చేయకండి).

వార్షిక చందా రూ.399ల‌తో మీ కుటుంబం అంతా క‌లిసి ఈ షోతో పాటు ఇంకా ఎంతో ఎంట‌ర్‌టైనింగ్ కంటెంట్‌ను ఎంజాయ్ చేయ‌వ‌చ్చు.

ఇప్పటి వ‌ర‌కు ఎవ‌రూ చేయ‌లేని విధంగా ప్ర‌తి ఒక్క‌రినీ మేం ఎంటర్‌టైన్ చేస్తున్నాం’’ అన్నారు.

నంద‌మూరి బాల‌కృష్ణ అక్టోబ‌ర్ 14 మ‌ధ్యాహ్నం 2 గంట‌ల 13 నిమిషాల‌కు మీ స్క్రీన్స్‌లోకి క్రాష్ ల్యాండింగ్ చేయ‌బోతున్నారు.

అది కూడా ఓన్లీ ఆహా తెలుగులో మాత్రమే.

రజనీకాంత్ బర్త్ డే స్పెషల్.. ఈ స్టార్ హీరో గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?