2023 ఏడాదిలో క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన టాప్ స్టార్ క్రికెటర్లు వీళ్లే..!

ఈ 2023 ఏడాదిలో ఎంతోమంది క్రికెటర్లు క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించారు.అయితే రిటైర్మెంట్ ప్రకటించిన ఆ జాబితాలో ఉన్న టాప్ స్టార్ ఆటగాళ్లు ఎవరో చూద్దాం.

H3 Class=subheader-styleహాషీమ్ ఆమ్లా: /h3pదక్షిణాఫ్రికాకు చెందిన ఈ బ్యాటర్ 2023 జనవరిలో అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు.

రెండు దశాబ్దాల సుదీర్ఘ క్రికెట్ కెరీర్ లో దక్షిణాఫ్రికా( South Africa ) తరఫున అన్ని ఫార్మాట్లలో కలిపి 18672 పరుగులు చేశాడు.

H3 Class=subheader-styleఆరోన్ ఫించ్:/h3p ఆస్ట్రేలియా జట్టును టీ20 వరల్డ్ కప్ విజేతగా నిలబెట్టిన తొలి కెప్టెన్.

ఆస్ట్రేలియా జట్టు ఓపెనర్ గా జట్టుకు ఎన్నో అద్భుతమైన విజయాలు అందించడంలో కీలక పాత్ర పోషించాడు.

2023 ఫిబ్రవరిలో క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. """/" / H3 Class=subheader-styleమొయిన్ అలీ:/h3p ఇంగ్లాండ్ జట్టు ఆల్ రౌండర్ మొయిన్ అలీ( Moeen Ali ) ఇప్పటివరకు క్రికెట్లో 6603 పరుగులు చేశాడు.

అలాగే, 360 వికెట్లు తీశాడు.ఈ 2023లో క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు.

"""/" / H3 Class=subheader-styleఅంబటి రాయుడు:/h3p భారత జట్టు స్టార్ ప్లేయర్ అంబటి రాయుడు( Ambati Rayudu ) ఐపీఎల్ 2023 సీజన్లో చెన్నై జట్టు టైటిల్ గెలిచిన తర్వాత క్రికెట్ కు వీడ్కోలు పలికాడు.

"""/" / H3 Class=subheader-styleస్టూవర్ట్ బ్రాడ్: /h3pఇంగ్లాండ్ జట్టు( England ) స్టార్ బౌలర్.

అంతర్జాతీయ క్రికెట్లో 847 వికెట్లు తీశాడు.ఈ యాషెస్ 2023 టెస్టు సిరీస్ తర్వాత క్రికెట్ కు వీడ్కోలు పలికాడు.

"""/" / H3 Class=subheader-styleఅలెక్స్ హేల్స్:/h3p ఇంగ్లాండ్ కు చెందిన అలెక్స్ హేల్స్( Alex Hales ) 2022 లో టీ20 ప్రపంచ కప్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు.

ఇంగ్లాండ్ తరఫున అన్ని ఫార్మాట్లలో కలిపి 156 మ్యాచులు ఆడిన హేల్స్ 2023 ఆగస్టు 4న క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు.

"""/" / H3 Class=subheader-styleడ్వైన్ ప్రిటోరియస్:/h3p దక్షిణాఫ్రికా జట్టు ఆల్ రౌండర్ డ్వైన్ ప్రిటోరియస్ 2023లో అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు.

అయితే ఫ్రాంచైజీ క్రికెట్లో కొనసాగుతున్నాడు. """/" / H3 Class=subheader-styleమురళీ విజయ్:/h3p భారత జట్టులోకి 2008లో టెస్టుల్లో ఆరంగట్రం చేశాడు.

భారత్ తరపున తొమ్మిది టీ20 మ్యాచ్లు, 17 వన్డే మ్యాచ్లు, 61 టెస్ట్ మ్యాచ్లు ఆడి, 2023లో క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు.

"""/" / H3 Class=subheader-styleజోగిందర్ శర్మ:/h3p భారత జట్టు స్టార్ బౌలర్.2007లో టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో పాకిస్తాన్ ను ఓడించడంలో కీలక పాత్ర పోషించాడు.

ఈ 2023లో అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలికాడు.

ఈ ఏడాది టాలీవుడ్ ఇండస్ట్రీని కుదిపేసిన వివాదాలు ఇవే.. వివాదాలకు చెక్ పడినట్టేనా?