ఒకే ఓవర్ లో 6 సిక్స్ లు కొట్టిన డేంజరస్ బ్యాట్స్ మెన్స్ ఎంత మంది ఉన్నారో తెలుసా..?
TeluguStop.com
క్రికెట్ అంటేనే ఉత్సాహం.పరుగుల వరదల పారినా వికెట్ల వేట కొనసాగినా ప్రేక్షకుల ఎంజాయ్ మెంట్ మామూలుగా ఉండదు.
అయితే సెంచరీలు, డబుల్ సెంచరీలు చేసిన క్రికెటర్లు చాలా మంది ఉన్నారు.పదికి పది వికెట్లు తీసిన బౌలర్లనూ చూశాం.
ఒకే మ్యాచ్ లో ఆరు సిక్సులు కొట్టిన బ్యాట్స్ మెన్ ఉన్నారు.కానీ.
ఒకే ఓవర్ లో ఆరు బంతులకు ఆరు సిక్సులు కొట్టిన ఆటగాళ్లు కేవలం ఐదుగురంటే ఐదుగురే ఉన్నారు.
ఇంతకూ ఈ అరుదైన ఘనత సాధించిన ఆ క్రికెటర్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.
హజర్థుల బజాజ్
ఈ అప్ఘనిస్తాన్ క్రికెటర్ 2018లో జరిగి అప్ఘనిస్తాన్ ప్రీమియర్ లీగ్ లో ఖగుల్ జానన్ టీంలో ఆడాడు.
ఇన్సింగ్స్ లో నాలుగో ఓవర్ లో బౌలింగ్ కు వచ్చిన అబ్దుల్లా మజారి బౌలింగ్ లో 6 బంతులకు 6 సిక్సులు కొట్టాడు.
అంతేకాదు కేవలం 12 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు.టీ-20 ఫార్మాట్ లో అత్యంత వేగంగా 50 పరుగులు చేసిన క్రికెటర్ గా యువరాజ్, గేల్ సరసన నిలిచాడు.
సర్ గ్యారీ సోబర్స్ """/"/
వెస్టిండీస్ లెజెండరీ ఆల్ రౌండర్ సోబర్స్ 1963లోనే ఈ ఘనత సాధించాడు.
ఫస్ట్ క్లాస్ క్రికెట్ చరిత్రలో ఒకే ఓవర్ లో ఆరు సిక్సులు కొట్టిన తొలి బ్యాట్ మెన్ గా రికార్డు సృష్టించాడు.
రవిశాస్త్రి """/"/
సోబర్స్ రికార్డు సృష్టించిన 16 ఏండ్లకు ఆ రికార్డును బ్రేక్ చేశాడు ఇండియన్ క్రికెటర్ రవిశాస్త్రి.
1984లో జరిగిన రంజిట్రోఫీలో ముంబై తరుపున బరిలో దిగిన రవిశాస్త్రి బరోడా బౌలర్ తిలక్ రాజ్ ఓవర్ లో 6 సిక్సులు బాదాడు.
ఒకే ఓవర్ లో 6 సిక్సులు కొట్టిన తొలి ఇండియన్ బ్యాట్స్ మ్యాన్ గా రికార్డు సాధించాడు.
హెర్షల్ గిబ్స్
అంతర్జాతీయ క్రికెట్ హిస్టరీలో ఒకే ఓవర్ లో 6 సిక్సులు కొట్టిన తొలి బ్యాట్స్ మన్ గా బిగ్స్ ఘనత సాధించాడు.
సౌతాఫ్రికాకు చెందిన గిబ్స్ 2007లో జరిగిన వన్డే వరల్డ్ కప్ లో ఈ ఘనత సాధించాడు.
అంతకు ముందు డొమెస్టిక్ క్రికెట్ కే పరిమితమైన ఈ సిక్సుల రికార్డును ఇంటర్నేషనల్ క్రికెట్ కి పరిచయం చేశాడు హెర్షల్ గిబ్స్.
యువరాజ్ సింగ్
ఇంటర్నేషనల్ క్రిక్రెట్ చరిత్రలో ఒకే ఓవర్ లో ఆరు సిక్సులు కొట్టిన రెండవ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఘనత సాధించాడు.
టీ-20 వరల్డ్ కప్ లో ఈ రికార్డు సాధించాడు.ఈ మ్యాచ్ లోనే యూవీ 12 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు.
చెట్ల కొమ్మల్లో ఇరుక్కున్న ఆవు.. ఎలా కాపాడాడో చూస్తే..