హిందీ సీరియల్ లలో ఎంట్రీ ఇవ్వనున్న క్రికెటర్ శిఖర్ ధావన్.. జట్టులో స్థానం కోల్పోవడంతో..!

ప్రముఖ స్టార్ క్రికెటర్లలో ఒకరిగా గొప్ప పేరు తెచ్చుకున్న శిఖర్ ధావన్ ప్రస్తుతం భారత జట్టులో తన స్థానాన్ని కోల్పోయాడు.

ఐదు నెలల క్రితం వన్డే సిరీస్ లలో భారత జట్టుకు కెప్టెన్ గా సారథ్యం వహించిన శిఖర్ ధావన్ జట్టులో చోటు కోల్పోవడం అభిమానుల్లో నిరాశను మిగిల్చింది.

శిఖర్ ధావన్( Shikhar Dhawan ) ఐపీఎల్ 2023 సీజన్లో పంజాబ్ కింగ్స్ కు కెప్టెన్ గా సారథ్యం వహిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.

కానీ భారత జట్టులో స్థానం లేకపోవడం, ఐపీఎల్ కు ఇంకా సమయం ఉండడంతో జీ చానల్లో ప్రసారమయ్యే "కుండలి భాగ్య ( Kundali Bhagya ) అనే సూపర్ హిట్ సీరియల్లో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించబోతున్నాడు.

"""/" / పోలీస్ ఆఫీసర్ డ్రెస్ లో ఉన్న శిఖర్ ధావన్ ఫోటోలు వైరల్ కావడంతో.

అభిమానులంతా ఐపీఎల్ 2023 ప్రోమో అనుకున్నారు.కానీ సీరియల్ లో నటిస్తున్న సంగతి తెలియడంతో అభిమానుల్లో నిరాశ నెలకొంది.

శిఖర్ ధావన్ తన కెరీర్లో 34 టెస్టులలో ఆడి 2315 పరుగులు చేశాడు.

ఇందులో ఏడు సెంచరీలు, ఐదు అర్థ సెంచరీలు ఉన్నాయి.167 వన్డేలు ఆడి 6793 పరుగులు సాధించాడు.

ఇందులో 17 సెంచరీలు 39 అర్థ సెంచరీలు ఉన్నాయి.కీలకమైన మ్యాచ్ లలో అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడి "మిస్టర్ ఐసీసీ టోర్నమెంట్" గా గుర్తింపు దక్కింది.

"""/" / శిఖర్ ధావన్ కు తన వయస్సు, స్ట్రైయిక్ రేటు కారణం అంటూ బీసీసీఐ( BCCI ) ఒక్కో ఫార్మాట్ నుండి దూరం చేస్తూ, చివరకు 2022లో పూర్తిగా భారత జట్టు నుండే సైడ్ చేసేసింది.

37 ఏళ్ల శిఖర్ ధావన్ వ్యక్తిగత జీవితానికి వస్తే, వివాహం జరిగి పిల్లలు ఉన్న ఆయేషా ముఖర్జీని ప్రేమ వివాహం చేసుకున్నాడు.

కానీ ఏడాది క్రితం ఆయేషా ముఖర్జీ, శిఖర్ ధావన్ లు విడాకులు తీసుకున్నారు.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నా తమ్ముడు.. రాజమౌళి కామెంట్లకు ఫిదా అవ్వాల్సిందే!