మహమ్మద్ షమీ పై తీవ్ర ఆరోపణలు చేసిన హసీన్.. సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు..!
TeluguStop.com
భారత జట్టు బౌలర్ మహమ్మద్ షమీపై( Mohammed Shami ) అతని మాజీ భార్య హసీన్ జహాన్( Hasin Jahan ) మరోసారి తీవ్ర ఆరోపణలు చేస్తూ.
అమ్మాయిలతో వివాహేతర సంబంధాలు కొనసాగిస్తున్నాడని తెలిపింది.అదనపు కట్నం కోసం తరచూ వేధించేవాడని తెలిపింది.
అసలు ఏం జరిగిందో పూర్తిగా తెలుసుకుందాం.2014లో షమీ-హసీన్ కు వివాహం జరిగింది వీరికి ఒక కుమార్తె సంతానం.
కొంతకాలం తర్వాత మనస్పర్ధల కారణంగా తరచూ గొడవలు జరిగేవి.2018లో షమీ పై గృహహింస, వరకట్న వేధింపులు వంటి ఆరోపణలు చేస్తూ హసీన్ కోర్టును ఆశ్రయించింది.
2019 ఆగస్టులో కోల్ కత్తా కోర్టు షమీపై అరెస్ట్ వారెంట్ జారీ చేయగా.
షమీ ఈ అరెస్ట్ వారెంట్ పై సెషన్స్ కోర్టులో సవాలు చేశాడు.దీంతో 2019 సెప్టెంబర్ లో అరెస్ట్ వారెంట్, క్రిమినల్ విచారణ ప్రక్రియపై సెషన్స్ కోర్టు స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
"""/" /
అంతేకాకుండా తనకు భరణం కింద నెలకు రూ.10 లక్షల రూపాయలు ఇవ్వాలని కోర్టులో కేసు వేసింది.
అందులో రూ.7 లక్షలు తన ఖర్చులకోసం మరో రూ.
3 లక్షలు కుమార్తె కోసమని పేర్కొంది.దీనిపై విచారణ జరిపిన కోల్ కత్తా కోర్టు( Kolkata Court ) హసీన్ కు భరణం కింద ప్రతినెల రూ.
1.30 లక్షలు చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేసింది.
ఇందులో రూ.80 వేలు కుమార్తె కోసం, రూ.
50 వేలు హసీన్ కోసం చెల్లించాల్సిందిగా ఉత్తర్వులు జారీ చేసింది. """/" /
దీంతో హసీన్ 2023 మార్చిలో కోల్ కత్తా కోర్టును ఆశ్రయించి షమీ అరెస్ట్ వారెంట్ పై ఉన్న స్టేను ఎత్తివేయాలని పిటిషన్ దాఖలు చేసింది.
కానీ కోర్టు పిటిషన్ ఎత్తేయడానికి నిరాకరించింది.దీంతో హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ తాజాగా హసీన్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
ఉద్దేశపూర్వకంగానే నాలుగు సంవత్సరాల నుండి విచారణపై స్టేను కొనసాగిస్తున్నారని ఆరోపిస్తూ.షమీ అరెస్ట్ వారెంట్ పై ఉన్న స్టేను ఎత్తివేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
చిరంజీవి విశ్వంభర లో డ్యూయల్ రోల్ చేస్తున్నాడా..? ఆ పాత్రలేంటి..?