క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్…!

నల్లగొండ జిల్లా:దేవరకొండ పట్టణంలో క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడుతున్నారనే పక్కా సమాచారంతో ముగ్గురు నిధింతులను అరెస్టు చేసి వారి నుంచి రూ.

3.75 లక్షల నగదు ఐదు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు దేవరకొండ సీఐ శ్రీనివాస్ తెలిపారు.

బుధవారం రాత్రి దేవరకొండ పోలీస్ స్టేషన్లో సిఐ శ్రీనివాస్ ముగ్గురు నిధింతులను మీడియాకు చూపుతూ వివరాలను వెల్లడించారు.

దేవరకొండ పట్టణంలో గణేష్ నగర్ లో నివాసం ఉంటున్న శ్రీనివాస్ ఇంట్లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు ఈనెల 25న దేవరకొండలో పోలీసులను సమాచారం అందింది.

ఎస్సైలు సతీష్, సుధీర్ కుమార్ టాస్క్ ఫోర్స్ సిబ్బందితో కలిసి బెట్టింగ్ నిర్వహిస్తున్న ముగ్గురు వ్యక్తులకు పట్టుకొని విచరించారు.

వీరిలో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని మిర్జాపూర్ పట్టణానికి చెందిన శైలేష్ కుమార్,అగ్రహరి మూడు సంవత్సరాలుగా ఆన్లైన్లో బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు.

ఇతను టెలిగ్రామ్ యాప్ ద్వారా హార్దిక్ బుక్కీ ప్యానల్ నుంచి మెయిన్ లైన్ యాక్సెస్ను తీసుకున్నాడని,ఈ లింకును తన స్నేహితుడైన అదే రాష్ట్రం అదే పట్టణానికి చెందిన హిమంగు పటేల్ కు పంపించి ఆ యాప్ ద్వారా మొబైల్ ఫోన్ కు కనెక్ట్ చేసి ఆన్లైన్లో చాలామందికి కమిషన్ ద్వారా నెట్వర్క్ లో జైన్ చేసుకుంటూ ఇదే క్రమంలో ఈనెల 25న దేవరకొండ పట్టణంలో గణేష్ నగర్ లో శ్రీనివాస్ ఇంటికి వచ్చి ఐపీఎల్ బెట్టింగ్ ఆడుతుండగా పోలీసులు పట్టుకొని వారిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

ఈ దాడుల్లో హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ రెడ్డి,కానిస్టేబుల్స్ శంకర్,తిరుపతి తదితరులు ఉన్నారు.వీరిని మిర్యాలగూడ డిఎస్పీ వెంకటగిరి,సిఐ శ్రీనివాస్ అభినందించారు.

వింటర్ లో చర్మాన్ని తేమగా ఉంచడానికి తోడ్పడే బెస్ట్ హోమ్ మేడ్ లోషన్ ఇదే!