Sachin Tendulkar : ఆ సమస్యతో బాధ పడేవాళ్లకు ఆపరేషన్లు చేయిస్తున్న సచిన్.. మనుషుల్లో దేవుడంటూ?

మన దేశంలోని ప్రజలకు, క్రీడా అభిమానులకు సచిన్ టెండూల్కర్( Sachin Tendulkar ) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

క్రికెట్ లో ఆయన సృష్టించిన సంచలనాలు అన్నీఇన్నీ కాదు.సచిన్ ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ అభిమానులకు అంతకంతకూ దగ్గరవుతున్నారు.

సచిన్ ఫౌండేషన్( Sachin Foundation ) ద్వారా ఆయన సేవా కార్యక్రమాలను చేస్తున్నారు.

పెదవి సంబంధిత వైకల్యంతో బాధ పెడేవాళ్లకు ఆయన తన ఫౌండేషన్ ద్వారా సేవ చేస్తున్నారు.

ఎక్కువ సంఖ్యలో పేద పిల్లలకు సచిన్ టెండూల్కర్ వైద్య చికిత్స అందిస్తున్నారు.ఈ విషయం తెలిసిన నెటిజన్లు ఎంతగానో సంతోషిస్తున్నారు.

సచిన్ తన సంపాదనలో ఎక్కువ మొత్తాన్ని సేవా కార్యక్రమాల కోసం ఖర్చు చేస్తున్నారని సమాచారం అందుతోంది.

సచిన్ ఎన్నో కుటుంబాలలో వెలుగు నింపుతుండటం ఫ్యాన్స్ కు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుండటం గమనార్హం.

"""/" / సచిన్ కు సేవా కార్యక్రమాల విషయంలో కుటుంబ సభ్యుల సహాయసహకారాలు అందుతున్నాయని సమాచారం అందుతోంది.

సచిన్ టెండూల్కర్ గుర్తింపు ఉన్న వైద్యుల సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని తెలుస్తోంది.

శస్త్రచికిత్స( Surgery ) చేయించడం ద్వారా పిల్లల జీవితాలే మారిపోయాయని ఫౌండేషన్ నిర్వాహకులు చెబుతున్నారు.

"""/" / సెలబ్రిటీ స్టేటస్ ఉన్నవాళ్లు తమ వంతు సేవా కార్యక్రమాలు చేయడం ద్వారా ఎంతోమంది జీవితాలలో వెలుగు నింపవచ్చు.

సచిన్ ను నేటి తరం సెలబ్రిటీలు స్పూర్తిగా తీసుకుంటే బాగుంటుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

సచిన్ ను అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని పథకాలను అమలు చేస్తున్నా చాలామంది పేదలకు వైద్య చికిత్స అందడం లేదు.

సచిన్ టెండూల్కర్ మనుషుల్లో దేవుడంటూ మరి కొందరు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తుండటం నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది.

సచిన్ ను ఎంత ప్రశంసించినా తక్కువేనని ఫ్యాన్స్ చెబుతున్నారు.

బడ్జెట్ 6 లక్షలు.. కలెక్షన్లు 800 కోట్లు.. ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?