ఒమన్ సముద్రంలో మునిగిన చమురు నౌక .. 16 మంది గల్లంతు, అందులో 13 మంది భారతీయులే

ఒమన్( Oman ) సముద్ర తీరంలో పెను విషాదం చోటు చేసుకుంది.చమురు లోడుతో వెళ్తున్న నౌక సముద్రంలో మునిగిపోయింది.

ఈ ఘటనలో 16 మంది నౌక సిబ్బంది గల్లంతు అవ్వగా.వీరిలో 13 మంది భారతీయులు కాగా, ముగ్గురు శ్రీలంక వాసులు.

మునిగిపోయిన నౌకను ప్రెస్టీజ్ ఫాల్కాన్‌గా( Prestige Falcon ) గుర్తించారు.కొమొరోస్ జెండాతో వెళ్తున్న ఈ నౌక.

పోర్ట్ టౌన్ దుకమ్‌కు రాస్( Ross To Port Town Dukam ) మద్రాకకు ఆగ్నేయంగా 25 నాటికల్ మైళ్ల దూరంలో మునిగిపోయింది.

సమాచారం అందుకున్న ఒమన్ మారిటైమ్ సెక్యూరిటీ సెంటర్ .వెంటనే నేవీ, ఇతర సహాయక బృందాలను అలర్ట్ చేసింది.

ప్రమాదంలో ఓడ మునిగిపోయి తలకిందులైనట్లుగా వార్తలు వస్తున్నాయి.అయితే సముద్రంలో చమురు లీకైందా లేదా అన్నది మాత్రం తెలియరాలేదు.

"""/" / ఎల్‌ఎస్‌ఈజీ షిప్పింగ్ డేటా( LSEG Shipping Data ) ప్రకారం.

ఈ నౌక యెమెన్ రేవు పట్టణం .పోర్ట్ ఆఫ్ అడెన్‌కు వెళ్తోంది.

2007లో నిర్మించిన ఈ నౌక 117 మీటర్ల పొడవు ఉంటుందని తెలుస్తోంది.ఇలాంటి చిన్న ట్యాంకర్లను చిన్న తరహా తీర ప్రాంతాల్లో రవానాకు ఉపయోగిస్తారు.

ఒమన్ అధికారులు ఆ దేశ మ్యారిటైమ్ యంత్రాంగం సమన్వయంతో ఘటనాస్థలంలో సెర్చ్ , రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు.

దుకమ్ నౌకాశ్రయం ఒమన్ నైరుతీ తీరంలో ఉంది.దీనికి దగ్గరలోనే సుల్తానేట్ ప్రధాన చమురు, గ్యాస్ మైనింగ్ ప్రాజెక్ట్‌లు ఉన్నాయి.

ఇందులోని ప్రధాన చమురు శుద్ధి కర్మాగారం దుకమ్ పారిశ్రామిక జోన్‌లో భాగంగా ఉంది.

"""/" / అయితే ఈ నౌక ప్రమాదవశాత్తూ మునిగిపోయిందా లేక విద్రోహ కోణం ఉందా అన్నది తెలియరాలేదు.

గతేడాది అక్టోబర్ 7 తర్వాత హమాస్‌పై( Hamas ) ఇజ్రాయెల్ యుద్ధం మొదలైనప్పటి నుంచి గల్ఫ్ తీరం , ఎర్ర సముద్రం మీదుగా వెళ్తున్న వాణిజ్య నౌకలను ఇరాన్ మద్ధతున్న యెమెన్‌లోని హౌతీ రెబల్స్ లక్ష్యంగా చేసుకుంటున్నారు.

తాజా ఘటన వెనుక వీరి హస్తం ఏమైనా ఉందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ ఏడాది ఏప్రిల్‌లో హర్మూజ్ జలసంధి మీదుగా ప్రయాణిస్తున్న వాణిజ్య నౌక ఎంఎస్‌సీ ఏరిస్‌ను ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్ప్ (ఐఆర్‌జీసీ) కమెండోలు హెలికాఫ్టర్లతో వెంబడించి మరి తమ ఆధీనంలోకి తీసుకున్న సంగతి తెలిసిందే.

ఆ సమయంలో నౌకలో 25 మంది సిబ్బంది ఉండగా.వారిలో 17 మంది భారతీయులే.

వారిని విడిపించేందుకు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ ఎంతో శ్రమించారు.

ప్రభాస్ ఆ సినిమా సీక్వెల్ కోసం ఎదురుచూస్తున్న నాగ్ అశ్విన్..అంతగా నచ్చిందా?