‘కంగువ’ క్రేజీ అప్డేట్.. మొసలితో ఫైట్ చేస్తున్న సూర్య!

కోలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన సూర్యకు( Surya ) ఏ రేంజ్ ఫాలోయింగ్ ఉందో అందరికి తెలుసు.

కోలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు సూర్య యాక్టింగ్ అంటే ఎంతో మందికి ఇష్టం.

అందుకే ఈయన సినిమాల కోసం ఎదురు చూస్తుంటారు.అందులోను సూర్య ఎప్పుడు కూడా కొత్త కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తుంటాడు.

ఈ మధ్యనే సూర్య ఎంచుకునే ప్రతీ సినిమా సూపర్ హిట్ అవుతుంది.దీంతో సూర్యకు ఆడియెన్స్ లో గ్రాఫ్ కూడా పెరిగింది.

ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ చేస్తున్నాడు సూర్య.ప్రస్తుతం సూర్య డైరెక్టర్ శివ దర్శకత్వంలో ''కంగువ'' ( Kanguva ) సినిమాను చేస్తున్నాడు.

ఈ సినిమా పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతుంది.ఇది పాన్ ఇండియా వ్యాప్తంగా తెరకెక్కుతున్న నేపథ్యంలో అంతటా భారీ హైప్ పెరిగింది.

ఈ సినిమా నుండి ఫస్ట్ టీజర్ గ్లింప్స్ ఈ మధ్యనే రిలీజ్ అయ్యి సూపర్ రెస్పాన్స్ అందుకుంది.

ఇక ఈ గ్లింప్స్ తర్వాత ఈ సినిమాకు మరింత హైప్ పెరిగింది.ఇక ఈ సినిమా ఇప్పటికే 50 శాతానికి పైగానే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా షూట్ గురించి తాజాగా ఇంట్రెస్టింగ్ విషయం బయటకు వచ్చింది.

"""/" / ప్రజెంట్ చెన్నైలో షూట్ జరుగుతుండగా సూర్య పై ఒక మొసలితో( Crocodile ) క్రేజీ ఫైట్ సీక్వెన్స్ ను మేకర్స్ తెరకెక్కిస్తున్నారు అని రూమర్స్ వైరల్ అవుతున్నాయి.

ఈ న్యూస్ ఆడియెన్స్ లో మరింత క్రేజ్ పెంచేసాయి.సూర్య పవర్ఫుల్ రోల్ లో నటిస్తున్న ఈ సినిమాను కోలీవుడ్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

"""/" / యూవీ క్రియేషన్స్ అండ్ గ్రీన్ స్టూడియోస్ వారు సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా దాదాపు 10 భాషల్లో రిలీజ్ కానున్నట్టు టాక్.

కాగా ఈ సినిమాలో సూర్యకు జోడీగా దిశా పటానీ( Disha Patani ) హీరోయిన్ గా నటిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

‘డాకు మహారాజ్ ‘ సినిమా ట్రైలర్ లో బాబీ చేసిన తప్పు ఏంటో తెలుసా..?